Lucky Zodiac Signs: అక్టోబర్ నెల రాశి ఫలాలు.. ఈ రాశుల వారు భోగభాగ్యాలతో పాటు విపరీతమైన సంపద పొందుతారు!
Lucky Zodiac Signs In October 2024: గ్రహ సంచారాలపరంగా అక్టోబర్ నెల ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. అలాగే ఈ నెలలోనే ఎంతో ప్రాముఖ్యత కలిగిన దుర్గా నవరాత్రులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన యోగాలు కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది.
Lucky Zodiac Signs In October 2024: గ్రహ సంచారాలపరంగా అక్టోబర్ నెల ఎంతో ప్రాముఖ్యత కలిగిందిగా భావించవచ్చు. ఎందుకంటే ఈ నెలలో ఎంతో ప్రత్యేకమైన నవరాత్రులతో పాటు గ్రహ సంచారాలు, నక్షత్ర సంచారాలు కూడా జరగబోతున్నాయి. ముఖ్యంగా అక్టోబర్ మొదటి వారంలోనే బుధాదిత్య రాజయోగంతో పాటు కొన్ని రాజయోగాలు ఏర్పడుతున్నాయి. దీంతో కొన్ని రాశుల్లో పుట్టిన వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.. అంతేగాకుండా మరికొన్ని రాశుల వారికైతే అదృష్టం రెట్టింపు అవుతుంది. ఈ దుర్గా నవరాత్రులలో భాగంగా ఎంతో ప్రత్యేకమైన కొన్ని యోగాలు ఏర్పడబోతున్నాయి. వీటి ప్రభావం కొన్ని రాశుల వారిపై ప్రత్యక్షంగా పడితే మరికొన్ని రాశుల వారిపై పరోక్షంగా పడబోతోంది. దీంతో కొన్ని రాశుల వారికి ఆదాయం పెరిగితే మరికొన్ని రాశుల వారికి నష్టాలు కలుగుతాయి. అయితే ఏ రాశుల్లో పుట్టిన వారు అక్టోబర్ నెలలో అత్యధిక లాభాలు పొందగలుగుతారో ఇప్పుడు తెలుసుకోండి.
వృషభ రాశి:
అక్టోబర్ నెల వృషభ రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉండబోతోంది. దీని కారణంగా వీరికి కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి. అలాగే వృషభ రాశి వారికి అసంపూర్ణంగా ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. అలాగే డబ్బులు కూడా విపరీతంగా సంపాదిస్తారు. వీరికి జీవితంలో ఐశ్వర్యంతో పాటు ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. దీంతోపాటు విపరీతమైన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మిథునం రాశి:
మిథున రాశి వారికి కూడా అక్టోబర్ నెల ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశివారికి జీవితంలో సంతోషం పెరగడమే కాకుండా కెరీర్ కు సంబంధించిన విషయంలో ఊహించని లాభాలు పొందుతారు. అలాగే వైవాహిక జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా రెట్టింపు అవుతాయి.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెల ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వీరి కుటుంబాల్లో సంతోషకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. అలాగే ఎప్పటినుంచో కోరుకుంటున్న కోరికలు కూడా వెంటవెంటనే నెరవేరుతాయి. దీంతోపాటు కుటుంబ సభ్యుల నుంచి కూడా మంచి సపోర్టు లభించి ఊహించని లాభాలు పొందగలుగుతారు.
సింహరాశి:
సింహరాశి వారికి కూడా ఈనెల చాలా శుభ్రంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు కెరీర్ కు సంబంధించిన విషయాల్లో అద్భుతమైన అవకాశాలను పొందగలుగుతారు. ముఖ్యంగా ఒంటరి జీవితం గడుపుతున్న వారికి వివాహ ప్రతిపాదనలు కూడా వస్తాయి. అలాగే భాగస్వామ్య జీవితంలో వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. గత కొంతకాలంగా వస్తున్న ఎలాంటి సమస్యలైనా సులభంగా పరిష్కారమవుతాయి.
కన్యారాశి:
కన్యా రాశి వారికి కూడా అక్టోబర్ నెల ఎంతో శుభప్రదంగా ఉండబోతోంది. వీరికి కష్టానికి తగిన ప్రతిఫలం లభించబోతోంది. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. వీరు ఊహించని లాభాలతో పాటు విపరీతమైన సంపదను పొందగలుగుతారు. అలాగే ఎలాంటి సమస్యలైనా ఎంతో సులభంగా పరిష్కారమవుతాయి.
Also Read: Budhaditya Yog: జూలై 16 నుంచి ఈ రాశులవారు ధన వంతులు కాబోతున్నారు!
తులారాశి:
తులా రాశి వారికి కూడా అక్టోబర్ నెల ఎంతో లాభదాయకంగా ఉండబోతోంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో గోల్డెన్ లైఫ్ ప్రారంభమవుతుంది. తులా రాశి వారికి బ్యాంకు బ్యాలెన్స్ పెరగడమే కాకుండా.. కుటుంబ జీవితంలో సంతోషం విపరీతంగా పెరుగుతుంది. అలాగే వీరు కెరీర్ కు సంబంధించిన విషయంలో కూడా పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వీరి ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది.
Also Read: Budhaditya Raja Yoga: బుధాదిత్య రాజయోగం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి రాజ భోగాలతో పాటు సంపాదన రెట్టింపు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.