Budhaditya Yog Horoscope: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. బుధుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తూ ఉంటాడు. అలాగే ఎంతో శక్తివంతమైన సూర్యగ్రహం కూడా ఒక రాశి నుంచి మరో రాశికి ప్రతి 30 రోజులకు ఒక సారి సంచారం చేస్తుంది. ఇదిలా ఉంటే జూన్ 29వ తేదిన కర్కాటక రాశిలోకి బుధుడు సంచారం చేయబోతున్నాడు. ఆ తర్వాత జూలై 16వ తేదిన సూర్యుడు సంచారం చేస్తాడు. అయితే ఈ గ్రహం కూడా కర్కాటక రాశిలోకి సంచారం చేస్తుంది. కాబట్టి ఒకే రాశిలో సూర్యుడు, బుధ గ్రహాల కలయిక జరుగుతుంది. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. దీంతో ఈ యోగం శుభ స్థానంలో ఉండే రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశివారికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కన్య రాశి:
కన్యా రాశి వారికి బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల అదృష్టం ఒక్కసారిగా పెరుగుతుంది. అంతేకాకుండా ఎలాంటి పనుల్లోనైనా సులభంగా విజయాలు సాధిస్తారు. దీంతో పాటు అనుకున్న పనులు కూడా ఎంతో సులభంగా, తొందరగా చేసే ఛాన్స్‌లు ఉన్నాయి. వ్యాపారస్తులు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల అనేక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితులు కూడా త్వరగా మారుతూ వస్తాయి. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ సమయంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో అనుకున్న పనులు జరుగుతాయి. అంతేకాకుండా సమాజంలో కీర్తి, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అంతేకాకుండా ఎప్పటి నుంచో అనుకుంటున్న పనులు కూడా జరుగుతాయి. అలాగే దాంపత్య జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అలాగే చిరకాల కోరికలు కూడా తీరుతాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
మిథున రాశి:
మిథున రాశి వారికి ఈ బుధాదిత్య యోగం కారణంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి అదృష్టం పెరిగి అనుకున్న పనులు జరుగుతాయి. అంతేకాకుండా డబ్బు సంబంధిత అంశాల్లో కూడా అనేక మార్పులు వస్తాయి. అలాగే కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో పురోగతి లభిస్తుంది. అలాగే కుటుంబంలో శాంతి, ఆనందం నెల కొంటాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కూడా పొందుతారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి