Magh Purnima 2024 Impact on zodiac Signs:  హిందూ మతంలో మాఘ పూర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంది. ఈరోజున ప్రజలు నదీ స్నానం లేదా సముద్ర స్నానం చేసి విష్ణుమూర్తిని పూజిస్తారు. ఈ ఏడాది మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 3:33 గంటలకు ప్రారంభమై.. ఫిబ్రవరి 24న సాయంత్రం 5:59 వరకు కొనసాగుతుంది. సూర్యోదయ సమయాన్ని బట్టి మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 24న జరుపుకోనున్నారు. ఈసారి మాఘ పూర్ణిమ కన్యారాశిలో ఏర్పడటం వల్ల అద్భుత యోగం రూపొందుతుంది. ఈ యోగ ప్రభావం వల్ల మూడు రాశులవారు ధనవంతులు కాబోతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం
మాఘ పూర్ణిమ రోజు సంభవించబోతున్న యోగం వృషభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ కల నిజమయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు తొందరలోనే పూర్తవుతాయి. వ్యాపారులకు లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలో తెలుసుకుంటారు. కష్టపడి పనిచేస్తే తప్పక సక్సెస్ అవుతారు. 
కర్కాటక రాశి
కన్యారాశిలో సంభవించబోతున్న యోగం వల్ల మీరు మీ లక్ష్యాన్ని సాధిస్తారు. మీరు ఏ కార్యాన్ని చేపట్టిన దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటారు. మీరు ఎవరూ ఊహించని స్థాయికి వెళతారు. మీరు అప్పుల బాధ నుండి బయటపడతారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. 
మకరరాశి
ఈ అద్భుత యోగం వల్ల పెళ్లి కాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. మీరు ఏదైనా ఇల్లు లేదా ల్యాండ్ కొనుగోలు చేయవచ్చు. మీ టెన్షన్ లన్నీ దూరమవుతాయి. ఈరాశికి చెందిన విద్యార్థులు చదువుపై దృష్టిని లగ్నం చేస్తారు. దంపతుల మధ్య ప్రేమానారాగాలు పెరుగుతాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Trigrahi Yog 2024: ఈ రాశులవారిపై త్రిగ్రాహి యోగం ఎఫెక్ట్‌..మార్చి నెలలో జరగబోయే 100 శాతం ఇదే!  


Also Read: Money Plant Vastu: మనీ ప్లాంట్ నాటేటప్పుడు ఈ పొరపాటు చేస్తున్నారా? దరిద్రులవుతారు జాగ్రత్త..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter