Maha Shivaratri 2024: ప్రతి సంవత్సరం భారతీయులు మహాశివరాత్రి పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఈరోజు దేశవ్యాప్తంగా భక్తులు శివాలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ సంవత్సరం మహాశివరాత్రి పండగ మార్చి 8వ తేదీన వచ్చింది. పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజే పరమేశ్వరుడు పార్వతీదేవిని కళ్యాణం జరిగిందని..అందుకే ఈరోజుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుందని గ్రంథాల్లో పేర్కొన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఉన్న శివ భక్తులు ఈ మహాశివరాత్రి రోజున శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉపవాసాలు పాటిస్తారు. ఇలా చేయడం వల్ల సాక్షాత్తు మహా శివుని అనుగ్రహం లభించి జీవితంలో అన్ని సమస్యల నుంచి ముక్తి లభించి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. అయితే ఈరోజు చాలామంది దానధర్మ కార్యక్రమాలు కూడా చేస్తారు. ఇలా చేయడం వల్ల మహా శివుడి అనుగ్రహం లభించి సంవత్సరం పొడవునా కుటుంబం సంతోషంగా ఉంటుందని గ్రంథాల్లో పేర్కొన్నారు. అయితే మహాశివరాత్రి రోజున ఏయే వస్తువులను దానం దానం చేయడం శుభప్రదమో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహాశివరాత్రి రోజున తప్పకుండా దానం చేయాల్సిన వస్తువులు:
మహాశివరాత్రి రోజున తప్పకుండా ఆవులకు మేతగా రొట్టెలను తినిపించాలి. శివ పూజ అనంతరం ఈ పని చేయడం వల్ల జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా సాక్షాత్తు శివుడు ఆవును తల్లిగా భావిస్తాడు. ఇలా ఆవుకు గోధుమ పిండితో తయారు చేసిన రొట్టెలను తినిపించడం వల్ల మానసిక సమస్యలు కూడా దూరమవుతాయి.


మహాశివునికి ఆవు పాలు అంటే చాలా ఇష్టం.. కాబట్టి శివరాత్రి రోజున పాలతో తయారు చేసిన పదార్థాలను దానం చేయాలి. అలాగే శివ పూజలో భాగంగా పాలతో తయారుచేసిన నైవేద్యాన్ని సమర్పించి పేదలకు పంచి పెట్టాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శివుడి అనుగ్రహం లభించి అదృష్టవంతులవుతారు.


మహాశివరాత్రి రోజున చంద్రుడికి పాలతో తయారుచేసిన నైవేద్యాన్ని సమర్పించడం వల్ల కూడా అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఇలా సమర్పించిన నైవేద్యాన్ని ఐదుగురు పేదవారికి ప్రసాదంగా పంచి పెట్టడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని పురాణాల్లో పేర్కొన్నారు.


మహాశివునికి ఎంతో ఇష్టమైన తీపి పదార్థాల్లో ఖీర్ ఒకటి. భక్తిశ్రద్ధలతో తయారుచేసిన ఖీర్ ను మహాశివరాత్రి రోజున పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించి మూడు తీపి పదార్థాలను పేదలకు దానం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందంతో పాటు ఐశ్వర్యం కూడా పెరుగుతుందని పురాణాల్లో తెలిపారు.


Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!


మహాశివరాత్రి రోజున తప్పకుండా దానం చేయాల్సిన వస్తువుల్లో నల్ల నువ్వులు ఒకటి. నల్ల నువ్వులను దానం చేయడం వల్ల జాతకంలో ఉన్న శని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది అంతేకాకుండా వీరికి శని అనుగ్రహం లభించి అదృష్టవంతులు అవుతారని అవుతారు. అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. అలాగే నల్ల నువ్వులతో పాటు మహాశివరాత్రి రోజున దుస్తులను కూడా దానం చేయడం చాలా శుభ్రం.


Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter