Maha Shivaratri - Astrology - Budha - Shukar Sancharam : మరికొద్ది రోజుల్లో గ్రహాల్లో బుద్దికి, ఐశ్వర్యానికీ, అందానికి కారకులైన శుక్రుడు, బుధుడు తమ గతిని మార్చుకోబోతున్నాయి. గ్రహాలు నిరంతరం తమ ఉన్న స్థానం నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారీ జీవితాల్లో అనుకోని పరిణామాలు ఏర్పడుతాయి. అందులో కొన్ని రాశుల వారికీ అనుకోని లాభాలు అందుకుంటే.. మరికొందరు తమ జీవితంలో దుర్భర పరిస్థితులును ఎదుర్కోవాల్సి వస్తోంది. మార్చి 7 బుధుడు కుంభం నుంచి మీన రాశిలోకి ఆగమనం చేయనున్నాడు. అదే రోజు శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు కుంభంలోకి వెళ్లిన వెంటనే రాహువు, బుధుఉడు కలయిక ఏర్పడుతోంది. అదే సయమంలో శుక్రుడు అడుగుపెట్టగానే శని, శుక్రుల కలయిక ఏర్పడుతోంది. మహా శివరాత్రికి ఒక రోజు ముందు ఈ గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటున్నాయి. దీంతో ఈ రాశుల వారికీ అనుకోని లాభం కలగబోతుంది. ఇంతకీ ఏయే రాశుల వారికీ లాభం కలగనుందో మీరు ఓ లుక్కేయండి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథునరాశి:
భోళా శంకరుడికి లింగోద్భవం జరిగిన మహా శివరాత్రికి ఒక రోజు ముందు బుధుడు మరియు శుక్రుడు సంచారం వల్ల మిథున రాశి వారికీ అనుకూలంగా ఉంటుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న ధనం చేతికి అందుతుంది. అప్పుల బారి నుండి బయట పడతారు. కుటుంబంతో కలిసి ప్రయాణించడానికి అనుకూలమైన సమయం. పెట్టుబడికి అనుకూలమైనదిగా పరిగణించబడుతోంది.


సింహ రాశి:
సింహరాశి బుధుడు, శుక్రడు సంచారం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారస్థులకు అనుకూలమైన సమయం. గత కొంత కాలంగా వేధిస్తోన్న సమస్యలు ఒక్కొక్కటిగా తొలిగిపోతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఒత్తిడి దూరమవుతోంది. ప్రకృతిలో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం.


కన్య రాశి:


మహా శివరాత్రికి ఒక రోజు ముందు బుధ,శుక్ర గ్రహాల మార్పు వల్ల కన్యరాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తోన్న వారికి కొన్ని శుభవార్తలు అందుతాయి. వ్యాపార పరిస్థితులు బాగుంటాయి. ఆరోగ్యం విషయంలో ఎలాంటి అశ్రద్ద చేయద్దు. గతంతో పోలిస్తే ఆర్ధిక పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. మీ మనసును నియంత్రణలో ఉంచుకోవడం అత్యుత్తమం.


Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.


Also read: Ycp vs Prashant kishor: ఎన్ని పీకేలొచ్చినా పీకేదేం లేదు, ప్రశాంత్ కిశోర్‌పై మండిపడుతున్న వైసీపీ నేతలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.