Pitru Paksha Dates and Significance: మహాలయ అమావాస్య, పితృ పక్షం, పెత్తర అమావాస్య, పెద్దల అమావాస్య.. ఇలా పేర్లే వేరైనా ఇవన్నీ ఒక్కటే. ప్రతీ ఏటా భాద్రపద మాసంలో శుక్లపక్ష పౌర్ణమి నుంచి అశ్విని మాసం వరకు ఉండే అమావాస్యనే పితృ పక్షం అంటారు. తమను వదిలి వెళ్లిన తల్లిదండ్రులు, పూర్వీకులను తలచుకుని పితృ పక్షంలో వారికి పూజలు చేస్తారు. తద్వారా పితృ దేవతల అనుగ్రహం కలిగి పితృ దోష విముక్తి జరుగుతుంది. ఈ ఏడాది పితృ పక్షం ఎప్పుడు వస్తోంది..  ఈ కాలంలో పితృ దేవతల అనుగ్రహం కోసం ఏం చేయాలి.. తదితర అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పితృ పక్షం ఎప్పుడు.. చేయకూడని పనులేంటి :


ఈ ఏడాది సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 25 వరకు పితృ పక్షం ఉండనుంది. ఈ 15 రోజుల్లో తిథి ప్రకారం తమ పితృ దేవతలను పూజించాలి. ఏ తిథిలో చనిపోతే ఆ తిథి నాడు పితృ దేవతలను పూజించాలి. తద్వారా సంతాన లేమి వంటి సమస్యలు తొలగిపోతాయి. పితృ పక్షంలో కొత్త ఇల్లు కొనుగోలు, వాహన కొనుగోలు, గృహ ప్రవేశం, క్షవరం,కొత్త దుస్తులు ధరించడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు. అలాగే, మాంసాహారాన్ని భుజించవద్దు. ఆహారంలో వెల్లుల్లిని తీసుకోవద్దు.


పితృ పక్ష శ్రద్ధా దినాలు:


సెప్టెంబర్ 10, 2022 - పూర్ణిమ శ్రద్ధ భాద్రపద, శుక్ల పూర్ణిమ
11 సెప్టెంబర్ 2022 - ప్రతిపాద శ్రద్ధ, అశ్వినీ, కృష్ణ ప్రతిపాద
12 సెప్టెంబర్ 2022 - అశ్వినీ, కృష్ణ ద్వితీయ
13 సెప్టెంబర్ 2022 - అశ్వినీ, కృష్ణ తృతీయ
14 సెప్టెంబర్ 2022 - అశ్వినీ, కృష్ణ చతుర్థి
15 సెప్టెంబర్ 2022 - అశ్వినీ, కృష్ణ పంచమి
16 సెప్టెంబర్ 2022 - అశ్వినీ, కృష్ణ షష్ఠి
17 సెప్టెంబర్ 2022 - అశ్వినీ, కృష్ణ సప్తమి
18 సెప్టెంబర్ 2022 - అశ్విన్, కృష్ణ అష్టమి
19 సెప్టెంబర్ 2022 - అశ్వినీ, కృష్ణ నవమి
20 సెప్టెంబర్ 2022 - అశ్వినీ, కృష్ణ దశమి
21 సెప్టెంబర్ 2022 - అశ్వినీ, కృష్ణ ఏకాదశి
22 సెప్టెంబర్ 2022 - అశ్వినీ, కృష్ణ ద్వాదశి
23 సెప్టెంబర్ 2022 - అశ్వినీ, కృష్ణ త్రయోదశి
24 సెప్టెంబర్ 2022 - అశ్వినీ, కృష్ణ చతుర్దశి
25 సెప్టెంబర్ 2022 - అశ్వినీ, కృష్ణ అమావాస్య


పితృ దేవతలకు పిండ దానం చేయాలి :


పితృ పక్షంలో పితృ దేవతల ఆత్మకు శాంతి చేకూర్చేందుకు పిండ దానం, శ్రాద్ధం నిర్వహిస్తారు. పవిత్ర నది స్నానమాచరించి జలచరాలకు లేదా కాకులకు పిండదానం చేయడం ద్వారా పితృ దోష విముక్తి కలుగుతుంది. లేదా బ్రాహ్మణులను ఇంటికి పిలిచి పితృ దేవతలకు పూజ చేసి.. అనంతరం పురోహితులకు సాత్విక ఆహారంతో భోజనం వడ్డించాలి. ఇలా చేయడం వల్ల పై లోకంలో ఉన్న పూర్వీకులు సంతృప్తి చెందుతారు.
 


Also Read: Super Earth: భూమిని పోలిన మరో గ్రహం.. ఖగోళ పరిశోధనల్లో వెలుగులోకి.. 11 ఎర్త్ డేస్‌లో అక్కడ సంవత్సరం పూర్తవుతుంది..


Also Read: Gorantla Madhav: కోటి రూపాయలకు గోరంట్ల న్యూడ్ వీడియో బేరం? లీక్ చేసింది ఎవరు? సస్పెన్షన్ పై వైసీపీ లేటెందుకు?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook