Super Earth: భూమిని పోలిన మరో గ్రహం.. ఖగోళ పరిశోధనల్లో వెలుగులోకి.. 11 ఎర్త్ డేస్‌లో అక్కడ సంవత్సరం పూర్తవుతుంది..

Super Earth Discovered :భూమి లాంటి వాతావరణ పరిస్థితులు, మనుషులకు ఆవాసయోగ్యమైన పరిస్థితులు కలిగిన మరో గ్రహాన్ని అన్వేషించేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. 

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 8, 2022, 05:04 PM IST
  • సూపర్ ఎర్త్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు
  • రాస్ 508బీగా నామకరణం
  • జీవి ఉనికిపై పరిశోధనలు
Super Earth: భూమిని పోలిన మరో గ్రహం.. ఖగోళ పరిశోధనల్లో వెలుగులోకి.. 11 ఎర్త్ డేస్‌లో అక్కడ సంవత్సరం పూర్తవుతుంది..

Super Earth Discovered : ఖగోళ పరిశోధనలు ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తుంటాయి. విశ్వాంతరాళంలోని రహస్యాలను చేధించే క్రమంలో ఖగోళ శాస్త్రవేత్తలు కొత్త విషయాలను కనుగొంటుంటారు. తాజాగా ఈ విశ్వంలో భూమిని పోలిన మరో గ్రహాన్ని ఖగోళ శాస్త్రజ్ఞులు కొనుగొన్నారు. జపాన్‌ సుబరు టెలీస్కోప్‌ సాయంతో చేపట్టిన సుబరు స్ట్రాటజిక్ ప్రోగ్రామ్ ద్వారా ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోగ్రాఫ్ ఐఆర్‌డీని ఉపయోగించి ఈ కొత్త గ్రహాన్ని గుర్తించారు. దీనికి రాస్ 508 బీ అని నామకరణం చేశారు. దీన్నే సూపర్ ఎర్త్ అని కూడా పిలుస్తున్నారు.

సూపర్ ఎర్త్ ప్రత్యేకతలు :

రాస్ 508బీగా పిలవబడుతున్న ఈ సూపర్ ఎర్త్ భూమి నుంచి 37 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.

ఈ సూపర్ ఎర్త్ ద్రవ్య రాశి భూమి కన్నా 4 రెట్లు అధికం.

ఈ సూపర్ ఎర్త్‌పై ఒక సంవత్సర కాలం 11 ఎర్త్ డేస్‌తో సమానం. ఈ గ్రహం కేవలం 10.85 రోజుల్లోనే తన కక్ష్యను పూర్తి చేస్తుంది. సూపర్ ఎర్త్ పరిభ్రమించే రెడ్ డ్వార్ఫ్ నక్షత్రం చుట్టూ ఉండే కక్ష్య సౌర వ్యవస్థలో ఉండే కక్ష్య కన్నా చాలా చిన్నది కావడమే ఇందుకు కారణం.

ఈ సూపర్ ఎర్త్‌పై నీరు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

పాలపుంతలో ఉన్న మూడో వంతు నక్షత్రాల్లో రెడ్ డ్వార్ఫ్ నక్షత్రాలే. ఇవి సూర్యుడి కన్నా చిన్నవి. సౌర వ్యవస్థకు పొరుగునే ఇవి పెద్ద సంఖ్యలో ఉన్నాయి.

ఇతర నక్షత్రాలతో పోలిస్తే రెడ్ డ్వార్ఫ్ నక్షత్రాలు చాలా చల్లదనం కలిగి ఉంటాయి. అక్కడ వెలుతురు కూడా తక్కువే. కాబట్టి అక్కడ పరిశోధనలు సంక్లిష్టమే. 

భూమి లాంటి వాతావరణ పరిస్థితులు, మనుషులకు ఆవాసయోగ్యమైన పరిస్థితులు కలిగిన మరో గ్రహాన్ని అన్వేషించేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ ఎర్త్‌ని గుర్తించడం కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ఇక్కడ నీటి ఆనవాళ్లు గుర్తించడంతో జీవి ఉనికికి అవాసయోగ్యమైన పరిస్థితులు ఉండొచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై మరింత లోతుగా పరిశోధనలు చేయాల్సి ఉంది.

Also Read: Horoscope Today August 8th : నేటి రాశి ఫలాలు.. ప్రేమలో ఉన్న ఈ రాశి వారిని ఇబ్బందులు చుట్టుముడుతాయి..

Also Read: KomatiReddy Rajgopal Reddy Live Updates: ఇవాళ స్పీకర్ కు కోమటిరెడ్డి రాజీనామా.. ఉప ఎన్నిక డేట్ ఫిక్స్?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News