Mars transit 2023 Effect: గ్రహాల కమాండరైన అగారకుడు వారం రోజుల కిందట అంటే మే 10న కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఈ రాశిలో కుజుడు బలహీనంగా ఉంటాడు. మార్స్ సంచారం కొన్ని రాశులవారికి అనుకూలంగా, మరికొన్ని రాశులవారికి ప్రతికూలంగా ఉంటుంది. అంగారక గోచారం వల్ల ఏయే రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందనున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి
కర్కాటక రాశిలో అంగారక సంచారం మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ ఆదాయం డబల్ అవుతుంది విద్యార్థులు చదువులో రాణిస్తారు. మీకు పనిలో ఒత్తిడి పెరుగుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కదు. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోండి. 
వృషభం
కుజు సంచారం వృషభరాశి వారికి చాలా మేలు చేస్తుంది. మీరు ఏదైనా వాహనం లేదా భూమిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ కోరికలన్నీ త్వరలో నెరవేరుతాయి. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశ ఉంది. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ కెరీర్ లోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి. 
మిధునరాశి
మార్స్ సంచారం వల్ల మిథునరాశి వారి ధైర్యం పెరుగుతుంది. మీ లైఫ్ పార్టనర్ తో విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. మీరు అనుకున్నది సాధిస్తారు.


Also Read: Surya Gochar 2023: వృషభరాశిలో సూర్య సంచారం.. ఈ 4 రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..


కన్య రాశి
రాబోయే 45 రోజులు కన్యా రాశి వారికి కలిసి రానుంది. అంగారక సంచారం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగంలో మార్పు వస్తుంది. మీరు ఫ్రెండ్స్ తో టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. 
తులారాశి
కుజుడి రాశి మార్పు వల్ల మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ పిల్లలు కెరీర్ లో ఉన్నత స్థాయికి వెళతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. లాండ్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ బిజినెస్ భారీగా విస్తరిస్తుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. 


Also Read: Saturn transit 2023: శతభిషా నక్షత్రంలో శని సంచారం.. రాబోయే 5 నెలలు ఈ 3 రాశులవారి జీవితం అల్లకల్లోలం...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook