Saturn transit 2023: శతభిషా నక్షత్రంలో శని సంచారం.. రాబోయే 5 నెలలు ఈ 3 రాశులవారి జీవితం అల్లకల్లోలం...

Shani Gochar 2023: ప్రస్తుతం శనిదేవుడు రాహువు నక్షత్రమైన శతభిషా నక్షత్రంలో  సంచరిస్తున్నాడు. శని గ్రహం యెుక్క సంచారం రాబోయే 5 నెలలు కొన్ని రాశులవారిపై చెడు ప్రభావాన్ని చూపనుంది. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 17, 2023, 03:54 PM IST
Saturn transit 2023: శతభిషా నక్షత్రంలో  శని సంచారం.. రాబోయే 5 నెలలు ఈ 3 రాశులవారి జీవితం అల్లకల్లోలం...

Shani Nakshatra Parivartan 2023 effect: మన జీవితంలో శనిదేవుడు చాలా కీ రోల్ ప్లే చేస్తాడు. మనం చేసే మంచి చెడులను బట్టి ఫలితాలను ఇస్తాడు కాబట్టి శనిదేవుడిని కలియుగ న్యాయమూర్తి అని పిలుస్తారు. ప్రస్తుతం శని కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఇతడు మార్చి 15న శతభిషా నక్షత్రంలో ప్రవేశించాడు. రాహువును ఈ రాశికి అధిపతిగా భావిస్తారు. శనిదేవుడు అక్టోబర్ 17 వరకు అంటే దాదాపు 5 నెలలు ఈ నక్షత్రంలో ఉంటాడు. ఈ సమయం మూడు రాశులవారిపై ప్రతికూల ప్రబావం చూపనుంది. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

మీనరాశి
శనిగ్రహ సంచారం మీనరాశి వారికి అశుభ ఫలితాలనిస్తుంది. మీపై శని సడే సతి కొనసాగుతుంది. మీరు ఈ సమయంలో అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి హెల్త్ ను జాగ్రత్తగా చూసుకోండి. మీకు రాబడి కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ప్రస్తుతానికైతే వాయిదా వేయడం మంచిది. 
కర్కాటక రాశి
శని రాశి మార్పు కర్కాటక రాశి వారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది . మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. ఆఫీసులో మీ సహచరులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీ శత్రువుల మీపై విజయం సాధిస్తారు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు బాగా ఆలోచించండి. 

Also Read: June Planet Transit 2023: జూన్ నెల ఈ 5 రాశులకు చాలా ప్రత్యేకం.. ఇందులో మీరున్నారా?

వృశ్చిక రాశి
శతభిషా నక్షత్రంలో  శని సంచారం వృశ్చిక రాశి వారికి హాని కలిగిస్తుంది. మీరు ఆస్తి వివాదాల్లో చిక్కుకుంటారు. మీరు భారీగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, లేకుంటే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. మీ హెల్త్ చెడిపోయే అవకాశం ఉంది.

Also Read: Surya Gochar 2023: వృషభరాశిలో సూర్య సంచారం.. ఈ 4 రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News