Margashirsha Purnima 2022: మార్గశిర మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే చాలు.. ధన వంతులవడం ఖాయం..
Margashirsha Purnima 2022: మార్గశిర మాసం అంటే శ్రీకృష్ణునికి ఎంతో ప్రాముఖ్యమైన నెలగా పురాణాల్లోని పలు గ్రంధాల్లో పేర్కొన్నారు. అయితే ఈ క్రమంలో శ్రీకృష్ణుని వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో చేయడం వల్ల ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం.
Margashirsha Purnima 2022: హిందూ పురాణాల ప్రకారం మార్గశిర మాసం ఎంతో ప్రాముఖ్యమైనది అంతేకాకుండా శ్రీకృష్ణునికి ఇష్టమైన రోజులుగా కూడా భావిస్తారు. అయితే ఈ మాసంలో ఉపవాసాలు పాటించి శ్రీకృష్ణుని పూజించడం వల్ల కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అని పూర్వీకుల నమ్మకం. మార్గశిర మాసం ముఖ్యంగా స్త్రీలకు ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ మాసంలోని కొన్ని తేదీల్లో శ్రీకృష్ణుని భక్తిశ్రద్ధలతో కొలిస్తే పుణ్యం లభించడమే కాకుండా పునర్జన్మ లభిస్తుందని పండితులు చెబుతున్నారు. డిసెంబర్లో గ్రహ సంచారాలు జరగడం మార్గశిర మాసంలో జరిగే శ్రీకృష్ణునికి సంబంధించిన వ్రతాలు పాటించాలా వద్దా అనే గందరగోళంలో కొందరు భక్తులున్నారు.
కృష్ణుని పూజకు సరైన సమయం ఇదే:
హిందూ క్యాలెండర్ ప్రకారం మార్గశిర పూర్ణిమ తిధి డిసెంబర్ 7 ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది. డిసెంబర్ 8 ఉదయం 9:30 నిమిషాలకు శుభ గడియలు ముగుస్తాయి. తిధి పూర్ణిమ రెండు అనుకూలంగా ఉండడంతో డిసెంబర్ 7వ తేదీన పౌర్ణమి జరుపుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
పౌర్ణమి రోజు చేయాల్సిన పనులు ఇవే:
>>మార్గశిర మాసంలోని పౌర్ణమి రోజున శ్రీకృష్ణునికి సంబంధించిన వ్రతాన్ని జరుపుకునే వారు తప్పకుండా ఉదయాన్నే స్నానం చేయాల్సి ఉంటుంది. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నవారు నది దగ్గర తల స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని పూర్వీకులు పేర్కొన్నారు.
>>స్నానం చేసిన తర్వాత పట్టు వస్త్రాలను ధరించి శ్రీకృష్ణుని ప్రతిమలకు గంధాన్ని అలంకరించి పూజా కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. పూజా కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణునికి ఇష్టమైన పంచామృతం స్వీట్లు పండ్లు సిరా నైవేద్యాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
>>శ్రీకృష్ణుని వ్రతంలో భాగంగా పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభించి శ్రీకృష్ణునికి నైవేద్యాలు సమర్పించి చివరిగా చందమామకు పూజలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మీ జాతకంలో చంద్రుడు బలంగా మారి అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
>>పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత శ్రీకృష్ణునికి సమర్పించిన నైవేద్యాలను ఐదుగురు ముత్తైదువులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే కుటుంబంలో శాంతి లభించి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Crime News: ప్రేమను నిరాకరించిందని.. యువతి గొంతుకోసి చంపేసిన ప్రేమోన్మాది!
Also Read: Crime News: ప్రేమను నిరాకరించిందని.. యువతి గొంతుకోసి చంపేసిన ప్రేమోన్మాది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook