Mangal Shukra Yuti 2023: 20 సంవత్సరాల తర్వాత కలయిక, ఈ రాశుల వారు ఏం చేసిన డబ్బు పొందడం ఖాయం
Mars and Venus Conjunction: కుజుడు, శుక్రుడు ప్రత్యేక యోగం కారణంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా బలపడే ఛాస్స్ కూడా ఉంది. ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Mangal Shukra Yuti 2023: కొన్ని గ్రహాలు చాలా సంవత్సరాల తర్వాత రాశి సంచారాల్లో కలిసాయి. ముఖ్యంగా ఈ సంవత్సరంలో సింహరాశిలో కుజుడు, శుక్ర గ్రహాల కలయిక కారణంగా ప్రత్యేక యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంగారక-శుక్రుడు సంయోగం జూలై 7 న జరిగింది. అయితే ముందుగా సింహరాశిలోకి శుక్ర గ్రహం సంచారం చేసింది. ఆ తర్వాత అంగారకుడు సంచారం చేయడంతో ప్రత్యేక యోగం ఏర్పడింది. కుజుడు-శుక్రుడు సంయోగం కారణంగా ఏయే రాశులవారి జీవితాలపై ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారిపై కుజుడు-శుక్రుడు సంయోగం ప్రభావం:
కర్కాటక రాశి:
సింహరాశిలో కుజుడు, శుక్రుడు సంయోగం చేయడం కారణంగా కర్కాటక రాశి వారు ఊహించని ప్రయోజనాలు పొందుతారు. ఈ సంచారాలు ఈ రాశివారికి రెండవ స్థానంలో జరిగాయి. ఈ రాశివారికి ప్రత్యేక సంయోగం కారణంగా ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరు వివిధ కారణాలతో పోగొట్టుకున్న డబ్బు ఈ క్రమంలో తిరిగిపోందుతారు. అంతేకాకుండా ఊహించని ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వ్యాపారాలు చేసేవారు పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు కూడా పొందవచ్చు.
Also Read: వినాయక చవితికి రానున్న విష్ణు విశాల్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ 'మార్క్ ఆంటోని'
మేష రాశి:
ఈ ప్రత్యేక సంయోగం కారణంగా ఈ రాశివారు బలవంతులుగా మారుతారు. అంతేకాకుండా పిల్లల నుంచి మంచి శుభవార్తలు వినే ఛాన్స్ కూడా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఆర్థికంగా కూడా ఈ రాశివారు ఊహించని లాభాలు పొందే అవకాశాలున్నాయి. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఈ క్రమంలో పెట్టుబడులు పెట్టడం వల్ల భారీ ఆర్థిక లాభాలు పొందుతారు. ఇక ప్రేమ జీవితం గడుపుతున్నవారికి శృంగార పరంగా లోటు ఉండదు. ఉద్యోగాలు చేస్తున్నవారికి ఈ క్రమంలో ప్రమోషన్స్ లభించే ఛాన్స్ కూడా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
కుంభ రాశి:
కుజుడు, శుక్రుడు సంయోగం కారణంగా కుంభ రాశివారు ఊహించని లాభాలు పొందుతారు. ఈ రాశివారికి సంయోగం 11వ స్థానంలో జరిగింది. దీని కారణంగా వీరు ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక ఉద్యోగాలు చేస్తున్నవారు ఈ సంయోగాన్ని వరంగా భావించవచ్చు. వీరు ప్రమోషన్స్ పొందడమేకాకుండా జీతం రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయి.
Also Read: వినాయక చవితికి రానున్న విష్ణు విశాల్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ 'మార్క్ ఆంటోని'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి