Mars-Venus Transit 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాల రాశి పరివర్తనానికి అత్యధిక మహత్యం ఉంది. గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి మారినప్పుడు ఆ ప్రభావం కొన్ని రాశులపై అనుకూలంగా ఉంటే, మరి కొన్నింటిపై ప్రతికూలంగా ఉంటుంది. మే 10వ తేదీన మంగళ గ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించనుండటం ఎలాంటి ప్రభావం కల్గించనుందో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంగళ గ్రహం గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం దాదాపు 2 నెలలు ఉంటుంది. ముఖ్యంగా 5 రాశుల జీవితాల్లో అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఊహించని రీతిలో ధనవర్షం కురుస్తుంది. మే 10 నుంచి జూలై 1 వరకూ ఈ ఐదు రాశుల వారి జీవితంలో ఏ విషయానికీ తిరుగుండదు. అంటే 51 రోజులు పట్టిందల్లా బంగారమే అని చెప్పవచ్చు. హిందూ పంచాంగం ప్రకారం మంగళ గ్రహాన్ని సాహసం, పరాక్రమం, ధైర్యం, సంపద, భూమి, పెళ్లికి కారకుడిగా భావిస్తారు. అలాంటి ఈ గ్రహం మే 10న కర్కాటక రాశిలో ప్రవేశిస్తుండటం మేషం, వృషభం, సింహం, కన్య, తుల రాశులకు మంగళప్రదంగా ఉంటుంది. ఈ ఐదు రాశుల జీవితాల్లో అంతులేని ధన సంపదలు వచ్చి పడతాయి. మే 30న శుక్రుడు సైతం ఇదే రాశిలో అంటే కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల ఈ రెండు గ్రహాలు కలిసి యుతి ఏర్పరుస్తాయి. అంటే ఒకే రాశిలో మంగళ, శుక్ర గ్రహాలు వేర్వేలు సమయాల్లో పరివర్తనం చెందనున్నాయి. 


తుల రాశి జాతకులకు మంగళ, శుక్ర గ్రహాల గోచారం కారణంగా పనిచేసే చోట గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. కొత్త పదవి, బాధ్యతలు లభిస్తాయి. సమాజంలో గౌరవం ఉంటుంది. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి.


శుక్ర, మంగళ గ్రహాల రాశి పరివర్తనం ప్రభావం కన్యా రాశి జాతకులకు మహర్దశ కల్గించనుంది. ఆర్ధికంగా ఏ సమస్యలుండవు. అపారమైన ధనవర్షం వచ్చి పడుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు అనువైన సమయం.


వృషభ రాశి జాతకులకు మంగళ గ్రహం గోచారం చాలా అనుకూలంగా ఉంటుంది. పదవి, డబ్బులు వద్దంటే వచ్చి పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు ప్రాప్తిస్తాయి. ప్రయాణాలు తప్పవు. ఆరోగ్యపరంగా కాస్త జాగ్ర్తత్తలు అవసరం. కానీ ఆర్ధికంగా బాగుంటుంది.


మంగళ గ్రహం గోచారం ప్రభావం మేష రాశి జాతకాలపై అద్బుతంగా ఉండనుంది. కొత్త ఇళ్లు, వాహనాలు కొనే యోగం ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. పెళ్లైనవారి జీవితంలో అంతా సవ్యంగా ఉంటుంది. ఆర్ధికంగా సమస్యలుండవు.


సింహ రాశి జాతకులపై మంగళ, శుక్ర గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం చాలా బాగుంటుంది. విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఆర్ధికంగా బాగుంటుంది. కారణం కోర్టు వ్యవహారాల్లో ఊహించని ఆర్ధిక లాభం కలగనుంది.


కుంభ రాశి జాతకులపై మంగళ గ్రహం గోచారం ప్రభావం చాలా బాగుంటుంది. పనిచేసే చోట ప్రశంసలు లభిస్తాయి. మీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా ఏ విధమైన సమస్యలు రాకపోవచ్చు. అంతా అనుకూలంగా ఉంటుంది.


Also read: Saturn Mars Conjunction 2023: 30 ఏళ్ల తర్వాత అశుభ యోగం చేస్తున్న శని-అంగారకుడు.. ఈ 4 రాశుల జీవితం నాశనం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook