Shadashtak Yoga effect: ప్రస్తుతం శనిదేవుడు తన సొంతరాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఇవాళ కుజుడు తన బలహీన రాశి అయిన కర్కాటక రాశిలో ప్రవేశించాడు. శని మరియు అంగారకుడు కలయిక వల్ల అరుదైన షడష్టక యోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా అశుభకరమైనదిగా భావిస్తారు.
కోపానికి, హింసకు మార్స్ కారకుడైతే.. దుఃఖానికి, దారిద్ర్యానికి శనిదేవుడిని కారకుడిగా పరిగణిస్తారు. కుండలిలో ఈ రెండు గ్రహాలు ఆరవ మరియు ఎనిమిదవ ఇంట్లో ఉన్నప్పుడు షడష్టక యోగం రూపొందుతుంది. ఈ యోగం కారణంగా రాబోయే రెండు నెలలపాటు నాలుగు రాశులవారు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోనున్నారు. అంతేకాకుండా మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. షడష్టక యోగం వల్ల ఏయే రాశులవారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారో తెలుసుకుందాం.
కుంభరాశి
కుంభ రాశి వారు షడష్టక యోగం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోనున్నారు. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీ దాంపత్య జీవితంలో అపార్ధాలు పెరుగుతాయి. మీకు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది.
కర్కాటక రాశి
శని మరియు కుజుల కలయిక వల్ల ఏర్పడిన షడష్టక యోగం వల్ల ఆస్తి వివాదాలు తలెత్తుతాయి. దేనిలోనైనా పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
సింహ రాశి
షడష్టక యోగం వల్ల మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మీ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. సింహరాశి వారు కెరీర్ లో అడ్డంకులు ఎదురవుతాయి. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి
శని కుజుడు సంయోగం వల్ల ధనుస్సు రాశి వారి ఖర్చులు భారీగా పెరుగుతాయి. మీరు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. మీ లైఫ్ పార్టనర్ తో విభేదాలు వస్తాయి. మీ పనులన్నీ ఆగిపోతాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటాయి. దీనిని జీ తెలుగు న్యూస్ ధృవీకరించలేదు.)
Also Read: Mangal Gochar 2023: రాబోయే 50 రోజులు ఈ 5 రాశులపై డబ్బు వర్షం.. ఈ జాబితాలో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook