Mangal Gochar 2022: మరో 6 రోజుల్లో మిథునంలోకి కుజుడు.. మేషరాశిపై ఎలాంటి ప్రభావమో చూడు..
Mangal Gochar 2022: ఈ నెల 16న కుజుడు మిథునరాశిలో సంచరించనున్నాడు. దీంతో మేషరాశివారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు.
Mangal Rashi Parivartan 2022: జ్యోతిషశాస్త్రంలో అంగారకుడిని క్రూరగ్రహంగా పరగణిస్తారు. దీనినే రెడ్ ప్లానెట్ గా పేర్కొంటారు. ఇతడు శక్తి, బలం, ధైర్యం, శక్తికి కారకుడు. మేషం మరియు వృశ్చికం రాశులకు అంగారకుడు అధిపతిగా భావిస్తారు. అక్టోబర్ 16న కుజుడు ఆదివారం మధ్యాహ్నం 12:04 గంటలకు వృషభం నుండి మిథునరాశికి కదులుతాడు. అంగారకుడి సంచారం వ్యక్తి యెుక్క స్వభావం, ప్రవర్తనను నేరుగా ప్రభావితం చేస్తుంది. జాతకంలో కుజుడు శుభస్థానంలో వ్యక్తి ధైర్యవంతుడు అవుతాడు. ఎవరి కుండలిలో అంగారకుడు బలహీన స్థితిలో ఉంటాడో ఆ వ్యక్తి యెుక్క ఆత్మవిశ్వాసం క్షీణిస్తుంది. అంతేకాకుండా అతడు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది.
మేషరాశిపై అంగారక సంచార ప్రభావం
మేష రాశి యెుక్క ఎనిమిదో ఇంటికి అధిపతి కుజుడు. ఈ రాశిలోని మూడో ఇంట్లో అంగారకుడు సంచరించనున్నాడు. దీంతో మీ ధైర్యం, శక్తి పెరుగుతాయి. అంతేకాకుండా మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఆఫీసులో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అంతేకాకుండా మీకు ప్రశంసలు దక్కుతాయి. మేషరాశి ప్రజలకు అదృష్టం ఉంటుంది. కుజుడు ఉద్యోగస్తులకు ప్రమోషన్ మరియు ఆదాయం వృద్ధి చేస్తాడు. వ్యాపారస్తులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అంగారక సంచార (Mars Transit in Gemini 2022) సమయంలో మేషరాశి వారు మంగళవారం నాడు దానిమ్మ మొక్కను నాటడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
Also Read: Guru Vakri 2022: తిరోగమనంలో బృహస్పతి.. ఇక ఈ 4 రాశులకు తిరుగుండదు మరి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి