Benefits Of  Navpancham Rajyog:  గ్రహాలు కాలానుగుణంగా రాశులను మారుస్తాయి. జూలై 1న కుజుడు కర్కాటక రాశిని వదిలి సింహరాశిలోకి ప్రవేశించాడు. అంగారకుడు సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు అది బృహస్పతితో కలిసి ఉంటుంది. దీనివల్ల నవపంచం రాజయోగం ఏర్పడుతోంది. ఆస్ట్రాలజీలో ఈయోగం చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. ఇది నాలుగు రాశులవారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి నవపంచం రాజయోగం చాలా లాభాలను ఇస్తుంది. మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు ఏదైనా కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులు ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. 
మేషరాశి
అంగారక గ్రహం మరియు బృహస్పతి కలయిక మేషరాశి వారికి సానుకూలంగా ఉంటుంది. ఈ రెండు గ్రహాలు చేసిన నవపంచం యోగం మీకు సమాజంలో గౌరవాన్ని ఇస్తుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. విద్యార్థులు ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం పొందుతారు. వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. 
సింహరాశి
ఈ రాశి వారికి నవపంచం రాజయోగం కూడా మేలు చేస్తుంది. ఈ సమయంలో బృహస్పతి అంగారక గ్రహాన్ని చూస్తున్నాడు. దీని వల్ల మీ కీర్తి పెరుగుతుంది. మీకు అదృష్టం పెరుగుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. 


Also Read: Mangal Gochar 2023: రాబోయే 45 రోజులపాటు ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారం.. మీరున్నారా?


తులారాశి
తుల రాశి వారికి కుజుడు మరియు బృహస్పతి కలయిక శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. జీతంలో పెరుగుదల ఉంటుంది. మీరు కొత్త ఉద్యోగంలో చేరుతారు. మీరు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. 


Also Read: Vakri Shani Effect: నవంబర్ 4 వరకు తిరోగమనంలో శని.. ఈ 3 రాశులకు ఊహించనంత మనీ..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి