Mars Transit 2023 makes Unauspicous Shadastak Yog: ధైర్యానికి కారకుడైన కుజుడు ఈ నెల చివరిలో అంటే జూన్ 30న కర్కాటక రాశిలో సంచరించబోతున్నాడు. ఇదే సమయంలో శనితో కలిసి కుజుడు షడాష్టక యోగాన్ని చేయబోతున్నాడు. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని అశుభకరమైనదిగా భావిస్తారు. ఇది ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. కుజుడు అగ్ని మూలకంగా భావిస్తారు. అలాంటి అంగారకుడు నీటి మూలకానికి చెందిన రాశిలో ఉంటుంది. ఇదే సమయంలో శని.. వాయు మూలకానికి చెందిన కుంభరాశిలో తిరోగమన స్థితిలో ఉండనున్నాడు. శని అంగారకుడి ఈ అశుభ యోగం ఏ రాశి వారికి అశుభం కాబోతుందో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటక రాశి


ఇదే రాశిలో కుజుడు ప్రవేశించడం వల్ల శనితో అశుభ యోగం ఏర్పడుతుంది. దీని వల్ల ఈ రాశి వారికి మానసిక, ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. ఈ సమయంలో మీరు అనవసర ప్రయాణాలు చేయవలసి రావచ్చు, దాని వల్ల మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ టైంలో ఎటువంటి లావాదేవీలు జరపవద్దు. మీరు అప్పు తీసుకోవాల్సి రావచ్చు. 


సింహరాశి


ఈ అశుభ యోగ ప్రభావం సింహ రాశి వారిపై కూడా కనిపిస్తుంది. ఈ రాశికి అధిపతి అయిన సూర్యుడు ఈ సమయంలో శుభ స్థానంలో ఉండటం వల్ల మీకు సంపద లభిస్తుంది. అయితే శని మరియు కుజుడు మీ డబ్బును ఖర్చు చేసేలా చేస్తారు. కుటుంబంలో గొడవలు వస్తాయి. పూర్వీకుల ఆస్తి విషయంలో తగాదాలు రావచ్చు. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 


Read More: Liver Detox: రోజు ఈ గింజలను తింటే ఎంత మద్యం సేవించినా.. ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు..


ధనుస్సు రాశి


మార్స్-శని యొక్క ప్రతికూల ప్రభావం ధనస్సు రాశివారిపై కూడా ఉంటుంది. వీరు సొంత వారి నుండే ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఈసమయంలో ఎటువంటి ఆర్థిక లావాదేవీలు చేయవద్దు. కొత్తగా వ్యాపారం చేయాలనుకునేవారికి ఇది మంచి సమయం కాదు. మీరు ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. ఈ టైంలో చిన్న చిన్న పెట్టుబడులు పెట్టడం వల్ల మీకు మేలు జరుగుతుంది. 


Also Read: Lucky Zodiac Sign: వినాయకుడికి ఇష్టమైన రాశులివే.. వీరికి దేనికీ లోటు ఉండదు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి