Daridra Yog effect: `దారిద్య్ర యోగం` చేయబోతున్న కుజుడు... ఈ 3 రాశులకు కష్టాలు షురూ..
Daridra Yog: మే 10న అంగారకుడు కర్కాటక రాశిలోకి సంచరించబోతున్నాడు. దీని కారణంగా దరిద్ర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో కొన్ని రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Mangal Gochar 2023 Effect: ఆస్ట్రాలజీలో అంగారకుడిని క్రూర గ్రహం, రెడ్ ఫ్లానెట్ అని పిలుస్తారు. దైర్యానికి కారకుడైన కుజుడు ఈ నెల 10న కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ రాశిలో అంగారకుడు చాలా బలహీనంగా ఉంటాడు. దీని కారణంగా అశుభ యోగం ఏర్పడుతోంది. ఆ యోగానికే దారిద్య్ర యోగమని పేరు. ఈ యోగ సమయంలో కొన్ని రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
మిధునరాశి
అంగారక గ్రహ సంచారం వల్ల దరిద్ర యోగం ఏర్పడుతోంది. ఇది మిధున రాశి వారికి అనేక ఇబ్బందులను కలిగిస్తుంది. మీరు కొన్ని సమస్యల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆదాయం తక్కువగా, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారంలో అస్సలు పెట్టుబడి పెట్టవద్దు, లేకుంటే భారీ నష్టాలను చవిచూస్తారు. శత్రువులతో కాస్తా జాగ్రత్తగా ఉండండి.
మకరరాశి
మకర రాశి వారికి దరిద్ర యోగం అశుభకరం. ఈ సమయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి దిగజారవచ్చు. మీ దాంపత్య జీవితంలో గొడవలు వస్తాయి. ఈ సమయంలో మీరు మోసపోయే అవకాశం ఉంది.
మీనరాశి
కర్కాటక రాశిలో కుజుడు సంచరించడం వల్ల మీన రాశి వారికి కష్టాలు పెరుగుతాయి. దరిద్ర యోగం వల్ల మీరు మానసికంగా కృంగిపోతారు. మీరు ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కోనే అవకాసం ఉంది. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దవారిని సంప్రదించండి. కోర్టు కేసుల్లో మీరు ఓడిపోయే అవకాశం ఉంది.
Also Read: Guru Rahu Yuti 2023: 36 ఏళ్ల తర్వాత అద్భుతమైన యాదృచ్చికం.. వీరి జీవితం కష్టాలమయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook