Mangal Gochar 2023: శత్రు రాశిలో కుజుడు సంచారం.. మే 10 వరకు ఈ రాశులకు అఖండ ఐశ్వర్యం..
Mars Transit 2023: జ్యోతిష్య శాస్త్రంలో అంగారకుడిని మేష, వృశ్చిక రాశికి అధిపతిగా భావిస్తారు. ప్రస్తుతం కుజుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. దీంతో మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.
Mangal Rashi Parivartan 2023: ఆస్ట్రాలజీలో అంగారకుడిని గ్రహాల కమాండర్ అని పిలుస్తారు. కుజుడిని అగ్ని మూలకంతో కూడిన గ్రహంగా భావిస్తారు. మార్స్ గ్రహాన్ని మేష, వృశ్చిక రాశికి అధిపతిగా భావిస్తారు. మార్చి 13న కుజుడు మిథునరాశిలోకి ప్రవేశించాడు. అంగారకుడు మే 10 వరకు అదే రాశిలో ఉంటాడు. అనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ కుజుడి సంచారం వల్ల కొన్ని రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు గురించి తెలుసుకుందాం.
సింహరాశి
మిథునరాశిలో అంగారకుడి సంచారం సింహరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. కుజుడు ఈ రాశి యెుక్క 11వ ఇంట్లోకి ప్రవేశించాడు. దీంతో మీ ఆదాయం పెరుగుతుంది. కష్టానికి తగిన ఫలాలు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. మీరు లాటరీ, బెట్టింగ్ లేదా మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఇదే మంచి సమయం.
తులారాశి
కుజుడు మీ రాశి యెుక్క 9వ ఇంట్లో కూర్చున్నాడు. ఈ రవాణా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు అదృష్టం కలిసి వస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు శుభకార్యాల్లో పాల్గొంటారు.
కన్య రాశి
కుజుడి సంచారం వల్ల మీరు కెరీర్ మరియు వ్యాపారంలో లాభాలను పొందుతారు. మీకు ఉద్యోగం దక్కే అవకాశం ఉంది. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. మీరు ఆర్థికంగా బలపడతారు. మీ బిజినెస్ విస్తరిస్తుంది. విద్య, మీడియా, బ్యాంకింగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ రవాణా సమయంలో ప్రయోజనం పొందుతారు.
Also Read: Sun transit 2023: మేషరాశి ప్రవేశం చేయనున్న సూర్యుడు.. ఈ 4 రాశులకు లాభాలు బోలెడు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook