సరిగ్గా ఐదురోజుల తరువాత అంటే జనవరి 13 నుంచి ఆ నాలుగు రాశులవారికి అంతులేని ధన సంపదలు లభిస్తాయని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. మంగళ గ్రహం సక్రమమార్గం కారణంగా ఆ రాశులవారికి శుభసూచకం కానుంది. మంగళ గ్రహం వృషభరాశిలో ప్రవేశించనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భూమి, సంపద, సాహసం, పరాక్రమం, పెళ్లి వంటి అంశాలకు కారకుడు మంగళ గ్రహం. ఈ గ్రహం నవంబర్ 13 నుంచి వృషభరాశిలో తిరోగమన మార్గం చేస్తున్నాడు. కానీ జనవరి 13 నుంచి అంటే మరో ఐదురోజుల తరువాత మంగళ గ్రహం సక్రమమార్గంలో వస్తున్నాడు. వృషభరాశిలో సక్రమమార్గం కారణంగా కొన్ని రాశులకు పూర్తిగా శుభసూచకం కానుంది. ఈ రాశులవారికి అంతులేని ధన సంపదలు లభిస్తాయి. దాంతోపాటు పెళ్లి సంబంధాలపై ప్రభావం పడుతుంది. 


మేషరాశి


మేషరాశి వారికి మంగళ గ్రహం సక్రమమార్గంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తాము చేయాల్సిన పనుల్ని పాజిటివ్ దక్పధంతో చేస్తూ ముందుకు సాగుతారు. ఫలితంగా కెరీర్ లక్ష్యాల్ని సులభంగా చేరుకోగలరు. కోపాన్ని నియంత్రించుకోవాలి.


వృషభరాశి


వృషభరాశి వారి ప్రేమ జీవితం, వైవాహిక జీవితంలో ఉండే సమస్యలు దూరమౌతాయి. పెళ్లికానివారికి పెళ్లవుతుంది. పెళ్లిలో వచ్చే సమస్యలు దూరమౌతాయి. భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారికి మంచి అనుకూలమైన సమయం.


మిథునరాశి


మిధునరాశి వారు కెరీర్ విషయంలో శుభవార్త వింటారు. నిలిచిపోయిన డబ్బులు తిరిగి చేతికి అందుతాయి. ఏదైనా పరీక్షలో విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. 


సింహరాశి


సింహరాశివారికి భూమి, భవనాల్నించి పెద్దఎత్తున లాభం కలగనుంది. సంపదకు సంబంధించిన విషయాల్లో వివాదముంటే..అది మీ పక్షంలో పరిష్కారమౌతుంది. కొత్త వాహనాలు కొనాలనే కోరిక తీరుతుంది. భాగస్వామి అణ్వేషణ ఫలించి పెళ్లవుతుంది. కుటుంబ జీవితం సుఖంగా ఉంటుంది. ఇంట్లో ఏదైనా ఉత్సవం జరగవచ్చు. వ్యాపారులకు ధనలాభం కలుగుతుంది. 


Also read: Trikona Raj Yoga 2023: కేంద్ర త్రికోణ రాజయోగం 2023.. ఈ 3 రాశుల వారిపై కురవనున్న డబ్బు వర్షం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook