Mars transit 2023: మే 10న అంగారకుడి రాశి మార్పు.. ఈ రాశులకు లాభాలు బోలెడు..
Mars transit 2023: మరో 8 రోజుల్లో అంగారకుడు కర్కాటక రాశి ప్రవేశం చేయనున్నాడు. దీంతో నాలుగు రాశులవారు స్పెషల్ బెనిఫిట్స్ పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Mangal Gochar 2023: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. ధైర్యం, భూమి మరియు వివాహానికి కారకుడిగా కుజుడిని భావిస్తారు. ఆస్ట్రాలజీ ప్రకారం, మే 10న అంగారకుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. జూలై 01 వరకు అతడు అదే రాశిలో కూర్చుని ఉంటాడు. అనంతరం కుజుడు సింహరాశిలోకి ఎంటర్ అవుతాడు. దీంతో రాబోయే 81 రోజులుపాటు కొన్ని రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలు పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి అంగారక సంచారం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. వ్యాపారం నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది.
మీనరాశి
కర్కాటక రాశిలో కుజుడు సంచారం మీనరాశి వారికి బాగుంటుంది. మీరు జాబ్ చేంజ్ అవ్వడానికి ఇదే మంచి సమయం. మీ ఆదాయం డబల్ అవుతుంది. మీపై విశ్వాసం పెరుగుతుంది. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది.
Also Read: May Horoscope 2023: ఈ నెలలో అంతరిక్షంలో కీలక పరిణామం.. ఈరాశులకు తీవ్ర నష్టం..
వృషభం
అంగారకుడి సంచారం వృషభ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు కొత్త జాబ్ వస్తుంది. మీడియాకు సంబంధించిన వ్యక్తులు ప్రత్యేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది.
కన్య రాశి
కర్కాటక రాశిలో కుజుడు సంచరించడం వల్ల కన్యా రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. ఆఫీసులో ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు.
Also Read: Chandra Grahan 2023: తొలి చంద్రగ్రహణం ఈ 4 రాశులకు వరం.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook