May Horoscope 2023: ఈ నెలలో అంతరిక్షంలో కీలక పరిణామం.. ఈరాశులకు తీవ్ర నష్టం..

May Horoscope 2023: ఈ నెలలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పెద్ద గ్రహాలైన శుక్రుడు, అంగారకుడు మరియు సూర్యభగవానుడు గమనంలో మార్పు రానుంది. దీంతోపాటు చంద్రగ్రహణం కూడా ఏర్పడనుంది. దీంతో 5 రాశులవారు ఆర్థికంగా ఇబ్బందులు పడనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 2, 2023, 09:37 AM IST
May Horoscope 2023: ఈ నెలలో అంతరిక్షంలో కీలక పరిణామం.. ఈరాశులకు తీవ్ర నష్టం..

May Grah Gochar 2023:  మే నెల మెుదలైంది. ఈ మాసంలో కుజుడు, శుక్రుడు, సూర్య భగవానుడు తమ రాశులను మార్చనున్నారు. దీనితో పాటు చంద్రగ్రహణం కూడా ఉంది. ఈ రోజు అంటే మే 2 నుండి గ్రహాల సంచారం ప్రారంభంకానుంది. ఇవాళ శుక్రుడు మిథునరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మే 05న చంద్రగ్రహణం ఏర్పడనుంది. మే 10న అంగారకుడు కర్కాటక రాశిలోకి, మే 15న సూర్యభగవానుడు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశులవారు భారీగా నష్టాలను చవిచూడనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 

వృశ్చిక రాశి
వీరు మే నెలలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు పెరుగుతాయి, ఇది వారి దాంపత్య జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మీరు కెరీర్ లో అనేక అడ్డంకులను ఎదుర్కోవల్సి ఉంటుంది. మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. 
మీనరాశి
ఈ నెలలో మీరు చాలా కష్టాలను ఎదుర్కోవల్సి రావచ్చు. మీరు లేదా మీ ఇంట్లో వాళ్లు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. లవ్ లో ఆటంకాలు వస్తాయి. మీ ఖర్చులు పెరగవచ్చు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. 
తులారాశి
గ్రహాల సంచారం వల్ల వీరి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. వీరి ఆదాయం తగ్గుతుంది. ఆఫీసులో అనేక సమస్యలు వస్తాయి. మీ జీవితం కష్టాలతో నిండి ఉంటుంది. 

Also Read: Sun Transit 2023: వృషభరాశిలోకి ప్రవేశించబోతున్న సూర్యుడు... ఈ 3 రాశులపై కనక వర్షం..

కర్కాటకం
కర్కాటక రాశి వారికి మే నెల ఇబ్బందికరంగా ఉంటుంది. ఆఫీసులో సహోద్యోగులతో విభేదాలు వస్తాయి. మీ కెరీర్ పై ప్రతికూల ప్రభావం పడుతుంది. మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి, లేకపోతే ఇతరులతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. వ్యాపారులు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. 
వృషభం
ఈ నెలలో మీరు ఏ పని చేపట్టినా అది చెడిపోతుంది. రాబడి కంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది. పిల్లల చదువు గురించి ఆందోళన చెందుతారు. డబ్బు లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆధ్యాత్మికతపై మీ మనసును మరల్చుకోవడం ద్వారా మీరు మానసికంగా బలంగా ఉంటారు. 

Also Read: Rahu Transit 2023: మీ జీవితాన్ని మార్చేసే మాయాగ్రహం, రాత్రికి రాత్రి కుబేరుల్ని చేస్తుంది అదృష్టం పరీక్షించుకోండి మరి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News