Mangal Gochar 2023: భారతీయ జ్యోతిషశాస్త్రంలో అంగారకుడిని అన్ని గ్రహాలకు అధిపతిగా పరిగణిస్తారు. ఇతడిని ధైర్య సాహసాలకు కారకుడిగా భావిస్తారు. గ్రహాల కమాండర్ అయిన కుజుడు వచ్చే నెలలో చంద్రుడి రాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మే 20వ తేదీ మధ్యాహ్నం 2.13 గంటలకు కుజుడు మిథునరాశిని వదిలి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. జూలై 1వ తేదీ ఉదయం 2.37 గంటల వరకు కుజుడు అదే రాశిలో సంచరిస్తాడు.  చంద్రుని రాశిలో కుజుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీనరాశి
కుజుడు  మీ రాశి యెుక్క ఐదవ ఇంట్లో సంచరిస్తున్నాడు. దీంతో మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. క్రీడలతో సంబంధం ఉన్న వ్యక్తులు పతకాలు లేదా అవార్డులను సాధిస్తారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారు విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. 
కన్య రాశి
కుజుడు ఈ రాశిలో పదకొండవ ఇంట్లో సంచరిస్తున్నాడు. దీంతో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీకు వివిధ మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. మీ శ్రమక తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు.


Also Read: Kedar Yog 2023: 500 ఏళ్ల తర్వాత కేదార్ యోగం.. ఏప్రిల్ 23 నుంచి ఈ రాశులకు డబ్బే డబ్బు..


వృషభం
మీ రాశి జాతకంలోని మూడవ ఇంట్లో కుజుడు సంచరిస్తున్నాడు. దీంతో మీలో ధైర్యం, ఉత్సాహం మరియు శక్తి పెరుగుతాయి. మీరు భవిష్యత్తులో మంచి ఫలితాలను పొందుతారు. మీరు మీ శత్రువులపై విజయం సాధిస్తారు. మీకు ప్రమోషన్ కూడా లభిస్తుంది. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది.
కుంభ రాశి
కుంభరాశి  యెుక్క ఆరవ ఇంట్లో మార్స్ సంచరిస్తున్నాడు. దీంతో మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఆగిపోయిన మీ పనులన్నీ మెుదలవుతాయి. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. మీరు అనారోగ్యం నుండి బయటపడతారు. 


Also Read: Vish Yog 2023 effects: ఏప్రిల్ 15న 'విష యోగం'.. రాబోయే 2 నెలలు ఈ రాశులకు కష్టకాలం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి