Vish Yog 2023 effects: ఏప్రిల్ 15న 'విష యోగం'.. రాబోయే 2 నెలలు ఈ రాశులకు కష్టకాలం..

What is Vish Yog: రేపు చంద్రుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా శని, చంద్రుల సంయోగం ఏర్పడుతుంది. వీరిద్దరి కలిసి విషయోగాన్ని చేయనున్నారు. ఈ యోగం కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపించనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2023, 05:24 PM IST
Vish Yog 2023 effects: ఏప్రిల్ 15న 'విష యోగం'.. రాబోయే 2 నెలలు ఈ రాశులకు కష్టకాలం..

Vish Yog 2023 effects: జ్యోతిష్యశాస్త్ర లెక్కల ప్రకారం, గ్రహాలు మరియు నక్షత్రాలు ఒక నిర్దిష్ట సమయం వరకు తమ రాశిని ఛేంజ్ చేస్తాయి. ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడిగా భావిస్తే.. చంద్రుడి మనస్సు యెుక్క కారకుడిగా పరిగణిస్తారు. అన్ని గ్రహాల్లోకెల్లా శనిదేవుడు చాలా నెమ్మదిగా కదులుతాడు. ఇతడు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తాడు.

ప్రస్తుతం శనిగ్రహం కుంభరాశిలో సంచరిస్తుంది. రేపు అంటే ఏప్రిల్ 15న చంద్రుడు అదే రాశిలోకి ప్రవేశించనున్నాడు. వీరిద్దరి కలయిక వల్ల విష యోగం ఏర్పడనుంది. దీని ప్రభావం కొన్ని రాశులవారిపై ప్రతికూలంగా ఉండనుంది. ఈ సమయంలో ఈ రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. 

జ్యోతిషశాస్త్రంలో శని క్రూరమైన మరియు న్యాయమైన గ్రహంగా, చంద్రుడు మనస్సు యొక్క కారకంగా వర్ణించబడ్డారు. చంద్రుని స్వభావం చంచలమైనదిగా ఉంటుంది. విష యోగ ప్రభావం రెండున్నర నెలల పాటు ఉంటుంది. దీని ఎఫెక్ట్ కన్యా, వృశ్చిక రాశులపై పడనుంది. ఈ సమయంలో  ఈ రాశులవారు మిశ్రమ ఫలితాలను పొందనున్నారు. దీని నుంచి బయటపడాలంటే కొన్ని పరిహారాలు చేయాల్సి ఉంటుంది.

Also Read: Kedar Yog 2023: 500 ఏళ్ల తర్వాత కేదార్ యోగం.. ఏప్రిల్ 23 నుంచి ఈ రాశులకు డబ్బే డబ్బు..

విషయోగ నివారణలు: 
** విష యోగ ప్రభావాన్ని తగ్గించడానికి శని దేవుడి దగ్గర నూనె దీపం వెలిగించి పెట్టండి
** శని దోషం ప్రభావం తగ్గాలంటే ఆవు, కుక్కలకు రొట్టెలు తినిపించండి.
** పీపుల్ చెట్టుకు నీరు పోసి దీపం వెలిగించండి.
** హనుమాన్ చాలీసా పఠించండి. అంతేకాకుండా సోమవారం శివలింగాన్ని పూజించండి మరియు గాయత్రీ మంత్రాన్ని జపించండి.

Also Read: Shani Rahu Yuti 2023: అక్టోబరు 17 వరకు వీరిని ఇబ్బంది పెట్టనున్న శని-రాహువు.. ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News