Budh Gochar 2023: జూన్ 24న మిథునరాశిలో `బుధాదిత్య రాజయోగం`.. ఈ 5 రాశులవారిపై డబ్బు వర్షం..
Budh Gochar 2023: గ్రహాల రాకుమారుడైన బుధుడు జూన్ 24న తన సొంత రాశి అయిన మిథునరాశిలో సంచరించబోతున్నాడు. దీని కారణంగా రాబోయే 14 రోజులపాటు 5 రాశులవారు అపారమైన ధనాన్ని పొందనున్నారు. ఇందులో మీరు ఉన్నారేమో చెక్ చేసుకోండి.
Budh Rashi Parivartan 2023: గ్రహాల యువరాజైన బుధుడు మరో మూడు రోజుల్లో రాశిని మార్చబోతున్నాడు. జూన్ 24వ తేదీ మధ్యాహ్నం 12.35 గంటలకు మెర్క్యూరీ తన సొంత రాశి అయిన మిథునరాశిలో సంచరించబోతున్నాడు. జూలై 08 వరకు అదే రాశిలో ఉంటాడు. అనంతరం కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. ఇప్పటికే మిథున రాశిలో సూర్యభగవానుడు సంచరిస్తున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల అరుదైన బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం ఐదు రాశులవారికి లాభిస్తుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
వృషభం
బుధుడి రాశి మార్పు ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆగిపోయిన ప్రమోషన్ వస్తుంది. అంతేకాకుండా ఉద్యోగంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఆఫీసులో మీకు సహోద్యోగులు మరియు సీనియర్ల నుండి ప్రశంసలు లభిస్తాయి అంతేకాకుండా ఫ్యామిలీ సపోర్టు కూడా ఉంటుంది.
సింహ రాశి
బుధాదిత్య రాజయోగం వల్ల మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు ఇప్పటికే పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి కోరిక నెరవేరుతుంది.
కన్య
మెర్క్యూరీ సంచారం మీ మేధో సామర్థ్యం పెరుగుతుంది. మీ వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. మీరు మంచి ఇంక్రిమెంట్‌తోపాటు ప్రమోషన్ కూడా పొందుతారు. కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది.
తులారాశి
రాజయోగం వల్ల మీ లవ్ సక్సెస్ అవుతుంది. అంతేకాకుండా మీరు వివాహ బంధంతో ఒకటయ్యే అవకాశం కూడా ఉంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వీరు పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకోవడం వల్ల మంచి లాభాలను పొందుతారు.
మిధునరాశి
ఈ రాశికి అధిపతి బుధుడు. మెర్క్యూరీ సంచారం వల్ల మిథునరాశి వారు గరిష్ట ప్రయోజనం పొందుతారు. మీ కెరీర్ దూసుకుపోతుంది. మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో విజయలక్ష్మీ మిమ్మల్నే వరిస్తుంది. రచన, కళ మరియు మీడియాతో సంబంధం ఉన్నవారికి ఈ సమయం బాగుంటుంది.
Also Read: Surya Grahan 2023: అక్టోబరులో చివరి సూర్యగ్రహణం.. ఈ రాశులకు కష్టకాలం.. మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook