హిందూమత జ్యోతిష్యం ప్రకారం బుధుడిని గ్రహాలకు రాజకుమారుడిగా పిలుస్తారు. అంతేకాకుండా బుద్ధి, ధనం, వ్యాపారానికి కారకుడిగా పరిగణిస్తారు. అలాంటి బుధ గ్రహం అస్తమించడం మాత్రం ఆ రాశులకు సమస్యల్ని తెచ్చిపెట్టనుంది. కొన్ని రాశుల వారి పని, ఆర్ధిక పరిస్థితిపై దుష్ప్రభావం చూపిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి పరివర్తనం లేదా గోచారముంటుంది. అదే విధంగా నిర్ణీత సమయంలో అస్తమించడం, ఉదయించడం జరుగుతుంది. గ్రహాలు ఇలా అస్తమించడం అనేది జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల గ్రహాల స్థితి బలహీనమై ప్రతికూల ఫలాన్నిస్తుంది. దీని ప్రతికూల ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. అయితే గ్రహాలు అస్తమించడం కొన్ని రాశులకు శుభసూచకం కూడా అవుతుంది. 


హిందూ పంచాంగం ప్రకారం ఫిబ్రవర 28వ తేదీ అంటే రేపు ఉదయం 9 గంటలకు బుధుడు కుంభరాశిలో అస్తమించనున్నాడు దీనివల్ల అన్ని రాశులపై పాజిటివ్, నెగెటివ్ ప్రభావం పడుతుంది. కొన్నిరాశులకు బుధగ్రహం అస్తమించడం వల్ల ప్రత్యేక సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఏ రాశి జాతకులకు బుధుడి అస్తమించడం ప్రతికూలంగా ఉంంటుందో తెలుసుకుందాం..ఆ దుష్ప్రభావం నుంచి కాపాడుకునేందుకు ఏం చేయాలో పరిశీలిద్దాం.


ఈ రాశులపై దుష్ప్రభావం


వృషభరాశి జాతకులకు బుధ గ్రహం అస్తమించడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. స్వబావంలో విసుగు, అశాంతి ఉంటాయి. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురౌతాయి.


మిథున రాశి జాతకులకు బుధుడి అస్తమించడం ప్రభావం చేస్తున్న పనుల్లో పలు సమస్యల్ని తెచ్చిపెడుతుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. విద్యార్ధులకు సమస్యాత్మకమే. అందుకే జాగ్రత్తగా ఉండాలి. 


సింహరాశి జాతకులకు వ్యాపారంలో ఎగుడుదిగుడులు కన్పిస్తాయి. జీవిత భాగస్వామితో విబేధాలు ఏర్పడవచ్చు. ఆర్ధిక పరిస్థితి బలహీనమౌతుంది. తీవ్రమైన నష్టాలు ఎదురు కావచ్చు. ఖర్చులు పెరిగి ఆర్ధికంగా ఇబ్బందులు కలుగుతాయి.


కన్యారాశి జాతకులకు బుధుడి ఆస్తమించడం వల్ల పూర్తిగా అశుభంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో సమస్య రావచ్చు. పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వివాదాలు ఉత్పన్నమౌతాయి. వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా ఆలోచించి వేయాలి. మాటలు నియంత్రించుకుంటే మంచిది. 


తులా రాశి జాతకులకు బుధగ్రహం అస్తమించడం మంచిది కాదు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. అదే సమయంలో మీ ఆరోగ్యంపై కూడా ధ్యాస అవసరం. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టకుండా ఉంటే అన్నివిధాలా మంచిది. 


మకర రాశి జాతకులకు ప్రతికూలం ప్రభావం ఉంటుంది. మాటలు నియంత్రించుకోవాలి. ఆర్ధిక పరిస్థితిలో ఎగుడు దిగుడు ఉంటుంది. కోపాన్ని నిగ్రహించుకోవాలి. ఆలోచించి ఖర్చు పెడితే మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదురౌతాయి.


కుంభరాశి జాతకులకు బుధుడి ఆస్తమించడం చాలా దుష్ప్రభావం చూపిస్తుంది. తీవ్రమైన ధననష్టం ఉంటుంది. ఆర్ధికంగా నష్టపోవడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. కుటుంబ జీవితంలో సమస్యలు ఉత్పన్నమౌతాయి. 


బుధుడి అస్తమయం-ఉపాయాలు


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధుడి ఆస్తమయం కారణంగా ఏర్పడే నెగెటివ్ ప్రభావం నుంచి రక్షించుకునేందుకు దుర్గాదేవిని పూజించాలి. బుధవారం నాడు పూజల వల్ల ఎక్కువ లాభాలుంటాయి. బుధగ్రహానికి సంబంధించిన మంత్రాలు జపించాలి. గ్రీన్ లేదా రెడ్ కలర్ వస్త్రాలు ధరించాలి. దాంతోపాటు బుధవారం నాడు పచ్చని కూరగాయలు లేదా పదార్ధాలు దానం చేయాలి.


Also read: Saturn Transit 2023: శని నక్షత్ర పరివర్తనం ప్రభావం, మార్చ్ 15 నుంచి ఆ 6 రాశులకు పట్టిందల్లా బంగారమే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook