Mercury Set 2023: మరో 2 రోజుల్లో అంతరిక్షంలో కీలక సంఘటన.. ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారం..
Mercury Set in aries 2023: ఫ్లానెట్ ప్రిన్స్ అయిన బుధుడి గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. మరో రెండు రోజుల్లో మెర్క్యూరీ అస్తమించబోతున్నాడు. దీని వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.
Budh Asta 2023 effect: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల రాకుమారుడు, గ్రహాల యువరాజు అని రకరకాల పేర్లుతో పిలుస్తారు. తెలివితేటలకు కారకుడైన మెర్క్యూరీ ప్రస్తుతం మేషరాశిలో తిరోగమన దశలో కదలడం ప్రారంభించాడు. అంతేకాకుండా మరో రెండు రోజుల్లో అంటే ఏప్రిల్ 23, రాత్రి 11.58 గంటలకు బుధుడు మేషరాశిలో అస్తమించనున్నాడు. మెర్క్యూరీ అస్తమయం వల్ల ఏయే రాశులవారు లాభాలను పొందనున్నారో తెలుసుకుందాం.
మీన రాశి
బుధుడి గోచారం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు కెరీర్, ఉద్యోగం మరియు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఈ సమయంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఈ సమయంలో టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది.
మేష రాశి
బుధుడి అస్తమయం మేషరాశి వారికి కలిసి రానుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ప్రభుత్వం ఉద్యోగం సాధించాలనే మీ కోరిక నెరవేరుతుంది. వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు మీ లక్ష్యాన్ని సాధిస్తారు. వివిధ రకాలుగా ఆదాయం సమకూరుతుంది. ఆఫీసులో మీకు బాధ్యతలు పెరుగుతాయి.
Also Read: Guru Uday 2023: మేషరాశిలో ఉదయించబోతున్న గురుడు.. ఈ నాలుగు రాశుల వారు జాగ్రత్త..
కుంభ రాశి
మెర్క్యూరీ అస్తమయం వల్ల మీరు మంచి ప్రయోజనాలు పొందనున్నారు. ఉద్యోగులు లాభపడతారు. బిజినెస్ చేసే వారికి ఈ సమయం బాగుంటుంది. మీరు కెరీర్ లో అపారమైన పురోగతి సాధిస్తారు. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తవుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook