Guru Uday 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, రేపు అంటే ఏప్రిల్ 22న బృహస్పతి మీనరాశిని వదిలి మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. గురుడు ఏప్రిల్ 27న అదే రాశిలో ఉదయించనున్నాడు. అదృష్టంతోపాటు ఐశ్వర్యాన్ని ఇచ్చే బృహస్పతి రైజింగ్ కొన్ని రాశులకు కలిసి వస్తే.. మరికొన్ని రాశులకు అస్సలు కలిసి రాదు. గురుడు ఉదయం సమయంలో ఏయే రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
కన్య రాశి
గురుడు రైజింగ్ సమయంలో కన్యా రాశి వారు అప్రమత్తంగా ఉండాలి. మీరు వ్యాపారంలో భారీగా నష్టపోయే అవకాశం ఉంది. మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కోంటారు. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు అనేక సమస్యలను ఎదుర్కోంటారు.
వృషభం
మేష రాశిలో బృహస్పతి ఉదయించడం వల్ల వృషభరాశి వారు చాలా కష్టాలను ఎదుర్కోంటారు. మీరు భారీగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. మీ జాబ్ పోయే అవకాశం ఉంది. మీ పని భారం పెరుగుతుంది. దాంపత్య జీవితంలో అస్సలు సుఖం ఉండదు.
Also Read: Guru Gochar 2023: మరో 24 గంటల్లో వీరి జాతకం మారిపోనుంది.. ఇందులో మీ రాశి ఉందా?
తులారాశి
బృహస్పతి ఉదయించడం తులరాశి వారికి మంచిది కాదు. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఏ పని చేపట్టినా అది విఫలమవుతుంది. నిరుద్యోగులకు ఉపాధి లభించదు. వ్యాపారులు భారీగా నష్టపోతారు. ఉద్యోగులకు ఈ సమయం అస్సలు కలిసి రాదు.
వృశ్చికరాశి
వృశ్చిక రాశి వారికి బృహస్పతి ఉదయించడం వల్ల ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో గొడవలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టముడతాయి. ఉద్యోగ లేదా వ్యాపారంలో లాభాలు ఉండవు.
Also Read: Shukra Gochar 2023: మే 02న మిథున రాశిలోకి శుక్రుడు.. ఈ 4 రాశులకు లాభాలు బోలెడు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook