Budh Margi 2023 effect:  గ్రహాల రాకుమారుడైన బుధుడు మరో రెండు రోజుల్లో అంటే మే 15వ తేదీ రాత్రి 8.30 గంటలకు బుధుడు మేషరాశిలో ప్రత్యక్షంగా కదలనున్నాడు. బుధుడి గమనంలోని మార్పు కొందరికి శుభప్రదంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది. మీ జాతకంలో మెర్క్యూరీ బలమైన స్థానంలో ఉంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. అంతేకాకుండా మీ బిజినెస్ వృద్ధి చెందుతుంది. మిథునం మరియు కన్యారాశికి అధిపతిగా బుధుడిని భావిస్తారు. మెర్క్యూరీ మార్గి నాలుగు రాశులవారికి స్పెషల్ బెనిఫిట్స్ ఇవ్వనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహ రాశి- బుధ సంచారం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. వ్యాపారస్తులు మంచి లాభాలను గడిస్తారు. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ కెరీర్ దూసుకుపోతుంది. 
కర్కాటక రాశి - బుధుడి మార్గి మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఆఫీసులో మీ ప్రాబల్యం పెరుగుతుంది. మీరు ఉద్యోగ లేదా వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీరు మీ కెరీర్ లో మంచి పురోగతిని సాధిస్తారు. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఉద్యోగం మారాలనుకునేవారికి ఇదే మంచి సమయం. మీరు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. 


Also Read: రాబోయే 15 రోజుల్లో ఈ 4 రాశుల సుడి తిరగబోతుంది.. మీరున్నారా?


కన్యా రాశి- మెర్క్యూరీ గోచారం కన్యా రాశి వారికి మేలు చేస్తుంది. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. నిరుద్యోగులకు జాబ్ వస్తుంది. స్టాక్ మార్కెట్‌తో సంబంధం ఉన్నవారు లాభపడతారు. పూర్వీకుల ఆస్తి ద్వారా ప్రయోజనం పొందుతారు. 
ధనుస్సు రాశి- బుధుడి రాశి మార్పు ధనుస్సు రాశి వారికి మేలు చేస్తుంది. మీరు లైఫ్ కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకునే అవకాశం ఉంది. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. వీరికి ప్రతి పనిలో విజయం లభిస్తుంది.


Also Read: Surya Gochar 2023: మరో రెండు రోజుల్లో ఈ 5 రాశుల దశ మారనుంది.. మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook