Budh Gochar 2023 in leo: గ్రహాల రాకుమారుడిగా పిలువబడే బుధుడు స్థానంలో మార్పు ఆర్థిక పరిస్థితి, వృత్తి మరియు వ్యాపారాన్ని ప్రభావితం చేస్తుంది. జాతకంలో బుధుడు శుభస్థానంలో ఉన్నట్లయితే మీకు దేనికీ లోటు ఉండదు. జూలై 25న బుధుడు సింహరాశిలోకి ప్రవేశించాడు. సూర్యుని రాశిలో మెర్క్యురీ సంచారం మీ జీవితంలో పెను మార్పులను తీసుకురాబోతుంది. దీంతోపాటు సింహరాశిలో సూర్యుడి, బుధుడు కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ఇది మూడు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం: బుధగ్రహ సంచారం వృషభ రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీరు శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మీరు రుణ విముక్తి పొందుతారు. 
తుల: బుధగ్రహ గోచారం తులారాశి వారికి చాలా డబ్బును ఇస్తుంది. మీకు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. మీ కెరీర్ దూసుకుపోతుంది. ఉద్యోగంలో లాభం ఉంటుంది. పెరిగిన ఆదాయం ద్వారా మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ బిజినెస్ విస్తరిస్తుంది. 
మకరం: మెర్క్యూరీ సంచారం మకరరాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభం పొందుతారు. మీరు విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. మీ లవ్ లైవ్ బాగుంటుంది. పరిశోధన రంగంలో ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 


Also Read: Guru Vakri 2023: రివర్స్ లో కదలనున్న గురుడు... ఈ 3 రాశులకు ఊహించని లాభాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook