Budh Uday 2023: ధనుస్సు రాశిలో ఉదయించిన బుధదేవుడు.. వీరికి మంచి రోజులు మెుదలు..
Budh Uday 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, బుధుడు జనవరి 12న ధనుస్సు రాశిలో ఉదయించాడు. మెర్క్యూరీ గ్రహం యెుక్క సంచారం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది.
Budh Uday In Sagittarius 2023: వేద జ్యోతిషశాస్త్రంలో గణితం, తార్కిక శక్తి, వ్యాపారం మరియు తెలివితేటలకు బుధుడిని కారకుడిగా భావిస్తారు. బుధ గ్రహ గమనంలో మార్పు మెుత్తం 12 రాశుల వారిపై ఉంటుంది. మూడు రోజుల కిందట అంటే జనవరి 12న మెర్క్యూరీ గ్రహం ధనుస్సు రాశిలో (Budh Uday 2023) ఉదయించింది. బుధ గ్రహం ఉదయించడం వల్ల కొన్ని రాశుల వారికి మంచి రోజులు ప్రారంభం అయ్యాయి. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
బుధుడి ఉదయం ఈ మూడు రాశులకు శుభప్రదం
వృశ్చిక రాశిచక్రం (Scorpio): మెర్క్యురీ గ్రహం యొక్కఉదయం వృశ్చిక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే బుధ గ్రహం మీ రాశి నుండి రెండవ ఇంట్లో ఉదయించింది. ఉద్యోగ మరియు వ్యాపారులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి ఆదాయం రెట్టింపు అవుతుంది. మీ లైఫ్ పార్టనర్ నుండి సపోర్టు లభిస్తుంది. ఉద్యోగం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.
ధనుస్సు రాశిచక్రం (Sagittarius): మెర్క్యురీ గ్రహం యొక్క ఉదయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశిలోనే బుధుడు ఉదయించనున్నాడు. దీంతో మీరు ఏదైనా వ్యాధి నుండి బయటపడే అవకాశం ఉంది. మీరు పాత పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. పాలిటిక్స్ లో ఉన్నవారు మంచి పదవిని పొందే అవకాశం ఉంది. మీరు కెరీర్ లో విజయం సాధిస్తారు. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది.
మేష రాశిచక్రం (Aries): మెర్క్యురీ గ్రహం యొక్క సంచారం మేషరాశి ప్రజలకు ఆర్థికంగా బాగుంటుంది. ఈ రాశి యెుక్క తొమ్మిది ఇంట్లో బుధుడు ఉదయించనున్నాడు. మీ అదృష్టం ప్రకాశిస్తుంది. వ్యాపారంలో ఆకస్మిక ధనలాభం ఉంటుంది. డబ్బు రెట్టింపు అవుతుంది. ఆదాయంలో బలమైన పెరుగుదల ఉంటుంది. మెుత్తానికి ఈ సమయమ మీకు అనుకూలంగా ఉంటుంది.
Also Read: Mangal Margi 2023: అంగారకుడి గమనంలో పెను మార్పు.. ఇక వీరికి లక్కే లక్కు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook