Mercury Transit Effect:  జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధ గ్రహం మేదస్సుకు సంకేతం. ఎవరి జాతకంలోనైతే బుధ గ్రహ సంచారం బలంగా ఉంటుందో ఆ వ్యక్తుల మేదస్సు అద్భుతంగా ఉంటుంది. పదునైన మనస్సు కలిగి ఉంటారు. బుధ గ్రహ అనుగ్రహం కలిగితే అన్నింటా విజయాలు సొంతమవుతాయి.  ఈ నెల 21న బుధ గ్రహం కన్యా రాశిలోకి ప్రవేశించనుంది. అక్టోబర్ 25 వరకు కన్యా రాశిలోనే సంచరించనుంది. ఈ ప్రభావంతో నాలుగు రాశుల వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి. ఆ నాలుగు రాశులేంటి... వారికి కలిగే శుభ ఫలితాలేంటో ఇప్పుడు చూద్దాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధ గ్రహ సంచార ఎఫెక్ట్ :


మిథునరాశి (Gemini) - కన్యారాశిలో బుధుడి ప్రవేశం మిథున రాశి వారికి కలిసొస్తుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య బలమైన అనుబంధం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు కొలిగ్స్, అధికారుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. కొత్త కార్యం ఏదైనా మొదలుపెట్టాలనుకునేవారికి ఇది శుభ సమయం. కొత్త వెంచర్స్, కొత్త ఉద్యోగం, కొత్త బిజినెస్.. ఇలా కొత్తగా ఏం చేసినా మీకు కలిసొస్తుంది. వ్యాపారస్తులకు ధన లాభం కలుగుతుంది.


కర్కాటకం (Cancer) - కర్కాటక రాశి వారికి బుధ గ్రహ సంచారం శుభకాలం. తోబుట్టువులు, స్నేహితుల సహాయ సహకారాలు పొందుతారు. మీడియా, రచన, దర్శకత్వం, యాంకరింగ్, గ్లామర్ రంగాల్లో ఉన్నవారికి అన్నివిధాలా కలిసొస్తుంది. ఆర్థిక పరిస్థితి మునుపటికన్నా మెరుగవుతుంది. మీ నుంచి ఇతరులు సాయం ఆశిస్తారు. ఆపదలో ఉన్నవారికి తగిన చేయూతనందిస్తారు.


సింహం (Leo) - సింహ రాశి వారికి ఇది లక్కీ టైమ్. ఆస్తి సంబంధిత వివాదాల్లో మీదే పైచేయి అవుతుంది. స్థిరాస్తి అమ్మకాలు, కొనుగోళ్లు చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది. వారసత్వంగా వచ్చిన ఆస్తికి సంబంధించిన వివాదాలు తొలగిపోతాయి. మీ కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. మీ పలుకుబడి కారణంగా మీరు ఒక్క మాట చెప్పినా కొన్ని పనులు జరిగిపోతాయి.


కన్య (Virgo) - కన్యా రాశిలోకి బుధ గ్రహం ప్రవేశిస్తుండటంతో ఈ రాశి వారికి అన్నివిధాలా కలిసొస్తుంది. వ్యాపారపరంగా లాభదాయకంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు నయమవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూలత ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన పనులన్నీ సక్సెస్ అవుతాయి. వైవాహిక, కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. 


(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


Also Read: Mlc Kavitha: కేసీఆర్ ను బద్నాం చేసేందుకు బీజేపీ కుట్ర.. లిక్కర్ స్కాంతో తనకు సంబంధం లేదన్న కవిత


Also Read: ITBP Recruitment 2022: పదో తరగతి విద్యార్హతతో రూ.69 వేల వేతనం పొందే జాబ్స్.. ఐటీబీపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook