Mercury Transit 2023: ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో చాలా ముఖ్యమైన గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని ప్రభావం అన్ని రాశులవారిపై పడుతుంది. బుధుడు అక్టోబర్ 1న తన సొంత రాశిలో సంచారం చేయబోతున్నాడు. దీంతో రెండు రాజయోగాలు ఏర్పడబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అక్టోబర్ 1వ తేదీ రాత్రి 8:39 గంటలకు బుధుడు సింహరాశి నుంచి కన్యారాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా  భద్ర రాజయోగం ఏర్పబోతోంది. అయితే ఇదే సమయంలో సూర్యుడు కన్యారాశిలోకి కూడా సంచారం చేయబోతున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధాదిత్య రాజయోగం కారణంగా కొన్ని రాశులవారికి చాలా ప్రయోజనాలతో పాటు ఆర్థికంగా అనేక రకాల లాభాలు కలుగుతాయి. ఆ తర్వాత అక్టోబర్ 7న బుధుడు స్వాతి నక్షత్రంలోకి, ఆ తర్వాత అక్టోబర్ 31న విశాఖ నక్షత్రంలోకి ప్రవేశం చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో భద్ర రాజయోగం ఏర్పడుతుంది. కాబట్టి  సమయంలో కొన్ని రాశులవారికి ప్రయోజనాలు కలిగితే మరికొన్ని రాశులవారికి నష్టాలు కలుగుతాయి. 


కన్యారాశి:
బుధుడు  సింహ రాశిలోకి సంచారం చేయడం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు. ఈ సమయంలో వ్యాపారంలో పెట్టుబడి కోసం పెద్ద ఒప్పందాన్ని పొందే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి అనేక లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో చాలా వరకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా ప్రేమ జీవితంలో కూడా శృంగార జీవితాన్ని పొందుతారు. మీ పిల్లల నుంచి కూడా అనేక రకాల లాభాలు కలుగుతాయి. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


మిథున రాశి:
బుధుడి సంచారంతో బుధాదిత్య రాజయోగంతో పాటు భద్ర రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా మిథున రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ రీత్యా విదేశాలకు కూడా వెళ్లాల్సి రావచ్చు. అంతేకాకుండా వైవాహిక జీవితంలో శృంగారం కూడా అనుభవిస్తారు. ఇక వ్యాపరాలు చేసేవారికి పెద్ద మొత్తంలో మార్పులు రావచ్చు. విద్యార్థులకు కూడా అనే రకాల లాభాలు కలుగుతాయి.    


మకర రాశి:
మకర రాశి వారికి బుధుడు సంచారం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. రెండు రాజయోగాలు ఏర్పడటం వల్ల ఆదాయంలో మార్పులు వస్తాయి. దీంతో పాటు కుటుంబంలో కూడా ఆనందం రెట్టింపు అవుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో రెట్టింపు అవుతాయి. ఈ సమయంలో పాత స్నేహితులను కూడా కలిసే ఛాన్స్‌లు ఉన్నాయి. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి