హిందూమతంలో జ్యోతిష్యానికి అత్యధిక మహత్యముంది. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్ణీత రాశి ప్రవేశం కారణంగా 12 రాశులపై ప్రభావం పడుతుంటుంది. ఫిబ్రవరి 27వ తేదీన బుధుడి గోచారముంది. బుధుడు కుంభరాశిలో ప్రవేశించడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడనుంది. ఫలితంగా మూడు రాశులవారికి ఊహించని ధనలాభం కలగనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యంలో బుధాదిత్య రాజయోగాన్ని అత్యంత శుభ సూచకంగా భావిస్తారు. సూర్యుడు, బుధుడు ఏదైనా రాశిలో యుతి ఏర్పరిస్తే అది బుధాదిత్య రాజయోగమౌతుంది. ఫిబ్రవరి 27వ తేదీన బుధుడు కుంభరాశిలో ప్రవేశిస్తాడు. అప్పటికే ఆ రాశిలో ఉన్న సూర్యుడితో కలిసి యుతి ఏర్పరుస్తాడు. మార్చ్ 15 వరకూ ఈ యుతి ఉంటుంది. ఆ తరువాత సూర్యుడు మీనరాశిలో గోచారం చేయనున్నాడు. కుంభరాశిలో ఏర్పడనున్న బుధాదిత్య రాజయోగం అన్ని రాశులపై ప్రభావం చూపినా..3 రాశులకు మాత్రం అత్యంత ప్రయోజనకరం. కలలో కూడా ఊహించని ధనలాభం కలుగుతుంది. ఆ రాశులు, ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..


బుధ గోచారం ఏయే రాశులపై శుభ సూచకం


వృషభ రాశి


బుధుడి గోచారంతో ఏర్పడనున్న బుధాదిత్య రాజయోగం వృషభ రాశి జాతకులకు లాభాల్ని ఇస్తుంది. ఉద్యోగంలో వృద్ధి ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరనున్నారు. ఏదైనా పెద్ద కంపెనీలో భారీ జీతంతో ఆఫర్ ఉంటుంది. బదిలీ కోరుకునేవారికి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలుంటాయి. వ్యాపారంలో భారీ లాభాలు ఆర్జిస్తారు. రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండేవారికి లాభాలుంటాయి.


సింహ రాశి


సింహ రాశికి అధిపతి సూర్యుడు. బుధుడు గోచారంతో సూర్యుడితో కలిసి యుతి ఏర్పర్చనున్నాడు. బుధాదిత్య రాజయోగం సింహరాశి జాతకులకు అత్యంత లాభదాయకంగా ఉంటుంది. భాగస్వామితో సంబంధాలు బాగుంటాయి. భారీగా లాభాలు కూడా ఉంటాయి. పెళ్లి కానివారికి సంబంధాలు ఖాయమౌతాయి. శుభవార్తలు కచ్చితంగా వింటారు. 


మకర రాశి


బుధుడి రాశి పరివర్తనంతో ఏర్పడనున్న బుధాదిత్య రాజయోగం మకర రాశివారికి ఊహించని భారీ ధనలాభాల్ని కలగజేస్తుంది. ఈ జాతకం వారికి పెండింగులో పడ్డ డబ్బులు తిరిగి చేతికి అందుతాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడటమే కాకుండా ఆదాయం పెరుగుతుంది. విదేశాలకు వెళ్లడం వల్ల లాభాలుంటాయి. పెళ్లి కానివారికి జీవిత భాగస్వామి లభిస్తుంది. సంబంధాలు ఖరారౌతాయి. విదేశాలకు సంబంధించి పనులు చేసేవారికి విశేషమైన లాభముంటుంది. 


Also read: Shani Uday 2023: ఈ రాశుల వారికి మార్చిలో అద్భుతాలే.. ప్రతి సమస్య చిటికెలో మాయం! భారీగా బంగారం, వెండి వర్షం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook