Budha Mahadasha 2023: చాలామందికి శని మహా దశ గురించి తెలిసుంటుంది కానీ బుధ మహాదశ గురించి వినుండరు. ఏదైనా కుండలిలో బుధుడు శుభ స్థానంలో ఉంటే ఆ జాతకం వారికి చాలా మంచి జరగనుంది. బుధుడు అశుభ స్థితిలో ఉంటే..విబేధాలు, గొడవలు జరుగుతూనే ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూ పంచాంగాల ప్రకారం గ్రహాల మహాదశలు, రాశి పరివర్తనానికి, యుతి ఏర్పడటం జీవితంపై పెను ప్రభావం చూపిస్తుంటుంది. ఏదైనా గ్రహం దశ  మనిషికి చాలా శుభసూచకంగా ఉంటుంది. బుధ మహాదశ వ్యక్తకి జీవితంలో 17 ఏళ్ల వరకూ నడుస్తుంది. జ్యోతిష్యం ప్రకారం బుధుడిని వ్యాపారం, గణితం, తర్కం, బుద్ధి, తెలివితేటలకు ప్రతీకగా భావిస్తారు. ఎవరి కుండలిలోనైనా బుధుడు శుభస్థితిలో ఉంటే ఆ వ్యక్తి జీవితంలో అంతా బాగుంటుంది. మాటలతో చాలామందిని ప్రభావితం చేస్తాడు. బుధుడు అశుభస్థితిలో ఉంటే అన్నింటా ఓటమి పాలవుతాడు. శారీరకంగా , మానసికరంగా సమస్యలు ఎదురౌతాయి. బుధ మహాదశ మనిషి జీవితంలో ఎలాంటి శుభ , అశుభ పరిణామాలకు దారి తీయననుంది, బుధ మహాదశలో ఏం ఉపాయాలు ఆచరించాలనేది పరిశీలిద్దాం.


కుండలిలో శుభంగా బుధుడు


కుండలిలో బుధ గ్రహం శుభ స్థితిలో ఉంటే గణితంలో ఆ వ్యక్తి తేజోవంతుడై ఉంటాడు. లెక్కలు చాలా వేగంగా వేయగలుగుతారు. అందుకే బ్యాంకింగ్, ఎంబీఏ, గణితం, ఎకనామిక్స్ రంగాల్లో ఈ జాతకం వ్యక్తులు అద్భుతంగా రాణిస్తారు. గ్రూప్ డిస్కషన్స్ లో వీరికెవరూ సాటి లేరు.


కుండలిలో బుధుడు అశుభంగా ఉంటే


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఎవరైనా వ్యక్తి కుండలిలో బుధుడు అశుభం లేదా నీచ స్థితిలో ఉంటే మహాదశలో అశుభ ఫలాలు కలుగుతాయి. వ్యాపారంలో వైఫల్యం, ఈఎన్టీ సంబంధిత వ్యాధులు చుట్టుముడతాయి. బంధువులతో సంబంధాలు చెడిపోవచ్చు. జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆర్ధికంగా మిశ్రమంగా ఉంటుంది.


బుధ మహాదశలో చేయాల్సిన ఉపాయాలు


బుధ గ్రహాన్ని బలోపేతం చేసేందుకు కొన్ని ఉపాయాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఆకుపచ్చని కూరగాయలు, పచ్చని బట్టలు, పచ్చ పెసలు బుధవారం నాడు దానంగా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల కుండలిలో అశుభ స్థితి ప్రభావం పోతుంది. పశువులకు మేత కూడా పెట్టాలి. కిన్నరులకు డబ్బులిచ్చి ఆశీర్వాదం పొందాలి. దీంతోపాటు బుధుడి బీజ మంత్రం పఠించాలి.


Also read: Solar Eclipse 2023: సూర్య గ్రహణం ప్రభావం, 3 రాశులకు ఏప్రిల్ 20 నుంచి అంతా నరకమే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook