Mercury Transit July 2022: ఈ నెలలో బుధుడు మూడు సార్లు రాశిని మార్చబోతున్నాడు. ఇది వరకే జూలై 2న తన రాశి చక్రాన్ని మార్చి మిథునరాశిలోకి ప్రవేశించాడు. జూలై 17న మిథునం నుంచి కర్కాటక రాశిలోకి (Mercury Transit in Cancer 2022) ప్రవేశిస్తాడు. అనంతరం జూలై 31న కర్కాటకరాశిని వదిలి సింహరాశిలోకి వెళతాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, తెలివితేటలు, తర్కం, డబ్బు, వ్యాపారానికి కారకుడు బుధుడు. ఇలా నెలలో 3 సార్లు బుధుడు రాశిని మారడం (Budh Transit July 2022) మెుత్తం 12 రాశులపైనే ప్రభావం చూపుతుంది. కానీ ఇది 4 రాశులవారికి మాత్రం శుభ ఫలితాలను ఇవ్వనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus)- బుధ సంచారం వృషభ రాశి వారికి చాలా మేలు చేస్తుంది. ఈ రాశివారికి కొత్త జాబ్ వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వీరు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తన తెలివితో దీటుగా ఎదుర్కొంటారు.


సింహం (Leo)- బుధుడు రాశి మారడం వల్ల సింహ రాశి వారికి చాలా శుభప్రదం. మీరు ఊహించని ధనాన్ని పొందుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. సంబంధాలు మెరుగు పడతాయి. వ్యాపారస్తులు బాగా రాణిస్తారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. 


కన్య రాశి (Virgo)- మెర్య్కూరీ మార్పు కారణంగా... ఆగిపోయిన ప్రమోషన్ తిరిగి వస్తుంది. ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి. వ్యాపారులకు లాభాలు మెండుగా ఉంటాయి. ఉద్యోగం మారాలనుకునే వారు ఇదే మంచి సమయం. 


మకరం (Capricron)- మకర రాశి వారు వృత్తి, వ్యాపారాలలో లాభపడతారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. ప్రజలు మీ పనిని మెచ్చుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.


Also Read: Kark Sankranti 2022: కర్క సంక్రాంతి ఎప్పుడు? సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నప్పుడు శుభకార్యాలు ఎందుకు చేయరు? 



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook