Kark Sankranti 2022: కర్క సంక్రాంతి ఎప్పుడు? సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నప్పుడు శుభకార్యాలు ఎందుకు చేయరు?

Kark Sankranti 2022: సూర్యుడు మిథునరాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దానిని కర్క సంక్రాంతి అంటారు. కర్క సంక్రాంతి నుంచే వర్షాకాలం ప్రారంభమవుతుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 4, 2022, 07:15 PM IST
  • జూలై 16న కర్క సంక్రాంత్రి
  • ఈ రోజున వర్షాకాలం ప్రారంభం
  • పగటి సమయం ఎక్కువ
Kark Sankranti 2022: కర్క సంక్రాంతి ఎప్పుడు? సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నప్పుడు శుభకార్యాలు ఎందుకు చేయరు?

Kark Sankranti 2022: సూర్యుడు మిథునరాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దానిని 'కర్క సంక్రాంతి' అంటారు. ఈ ఏడాది కర్క సంక్రాంతిని (Kark Sankranti 2022) 16 జూలై 2022 శనివారం జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం, సూర్యుని దక్షిణ ప్రయాణం కర్క సంక్రాంతి నుండి మొదలవుతుంది, అంటే సూర్యభగవానుడు ఉత్తరాయణం నుండి దక్షిణాయనానికి వెళతాడు. కర్క సంక్రాంతిని 'శ్రావణ సంక్రాంతి' అని కూడా అంటారు. ఈ సమయంలో పగలు తక్కువగా, రాత్రి ఎక్కువగా ఉంటుంది. 

సూర్యుని దక్షిణాయన ప్రభావం
>> సూర్యభగవానుడి ఉత్తరాయణం, దక్షిణాయనం కారణంగా వాతావరణంలో కూడా మార్పులు సంభవిస్తాయి.  కర్క సంక్రాంతి నుంచే వర్షాకాలం ప్రారంభమవుతుంది.
>> దక్షిణాయన కాల వ్యవధి ఆరు నెలలు. దేవతల రాత్రి దక్షిణాయనం నుండి ప్రారంభమవుతుందని నమ్ముతారు.
>> దక్షిణాయనంలో సూర్యుడు సంచరించినప్పుడు ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు.  దక్షిణాయనంలో పూజలు, దానము, తపస్సులకు విశేష ప్రాధాన్యత ఉండడానికి ఇదే కారణం.
>> దక్షిణాయనం కర్క సంక్రాంతితో ప్రారంభమై మకర సంక్రాంతితో ముగుస్తుంది, ఆ తర్వాత ఉత్తరాయణం ప్రారంభమవుతుంది.
>> దక్షిణాయన సమయంలో సూర్యభగవానుడు... కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం మరియు ధనుస్సు రాశులలో సంచరిస్తాడు. 

దక్షిణాయనంలో శుభ కార్యాలు ఎందుకు జరగవు?
>> దక్షిణాయన సమయంలో విష్ణువును పూజిస్తారు. దీనితో పాటు, పూర్వీకుల శాంతి కోసం పూజలు మరియు పిండ ప్రధానం చేస్తారు.  
>> సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నప్పుడు శుభకార్యాలు చేసినా ఫలితం దక్కదు.
>> దక్షిణాయనంలో దేవతలు యోగ నిద్రలో ఉంటారు. అందుకే వివాహం, క్షౌరము, ఉపనయన సంస్కారాలు, గృహ ప్రవేశం మొదలైనవి నిషేధించబడ్డాయి.

Also Read: Sravana Masam 2022: శ్రావణ మాసంలో ఈ పరిహారాలు చేస్తే.. ధనలక్ష్మీ మీ వెంటే..! 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News