Mercury Transit 2023: బుధ గోచారంతో ఈ 5 రాశులకు 20 రోజులు నరకం తప్పదు
Mercury Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల రాజకుమారుడిగా బుధుడిని పిలుస్తారు. అందుకే బుధుడి గ్రహ గోచారానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. బుధుడు ఇప్పుడు ప్రత్యర్ధి గ్రహం రాశిలో ప్రవేశించనుండటంతో..కొన్ని రాశులవారికి తీవ్రమైన కష్టాలు తప్పడం లేదు.
Mercury Transit 2023: గ్రహాల రాజకుమారుడు బుధుడు మార్చ్ నెలాఖరులో రాశి పరివర్తనం చెందనున్నాడు. బుధుడి గోచారం కారణంగా కొన్ని రాశుల జాతకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ముఖ్యంగా 5 రాశులకు సమస్యాత్మకంగా మారనుంది. ఆ ఐదు రాశులేంటో తెలుసుకుందాం..
మార్చ్ 31వ తేదీన బుధ గ్రహం మంగళ గ్రహం రాశి మేషంలో మద్యాహ్నం 3 గంటల 28 నిమిషాలకు ప్రవేశించనున్నాడు. ఈ గోచారంతో మంగళ, బుధ గ్రహాల మధ్య అవగాహన ఏర్పడి లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడనుంది. అంటే మార్చ్ 31 నుంచి ఏప్రిల్ 21 వరకూ కొన్ని రాశులవారికి వ్యాపారం, ఉద్యోగం, కెరీర్, అర్ధిక అంశాల్లో తీవ్ర ఇబ్బందులు ఏర్పడనున్నాయి.
మేష రాశి
బుధ గోచారం మేషరాశి జీవితంలో అల్లకల్లోలం సృష్టించనుంది. ఈ సమయంలో ఈ రాశివారికి ఆర్ధిక ఇబ్బందులు ఎదురౌతాయి. ఖర్చులు అదుపు తప్పడం వల్ల అప్పుల పాలవుతారు. అందుకే ఖర్చులపై జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులపై అప్రమత్తంగా ఉండాలి. వీలైనంతవరకూ డబ్బులు ఆదా చేయాలి. పెట్టుబడుల్లో అప్రమత్తత అవసరం. ఉద్యోగం, సంపాదన బాగానే ఉంటుంది. ఆకస్మిక యాత్రలు చేస్తారు.
కుంభ రాశి
కుంభ రాశి జాతకులకు ఈ సమయం కలకలంగా ఉంటుంది. అప్రమత్తంగా లేకపోతే డబ్బుల విషయంలో మోసపోతారు. ప్రత్యర్ధులు కూడా మీపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తారు. ఈ సందర్భంగా తల్లితో విభేదాలు రావచ్చు. దీంతో ఇంట్లో అశాంతి ఉంటుంది. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
వృశ్చిక రాశి
బుధ గ్రహం మేష రాశి ప్రవేశం కారణంగా మీరు చాలా సవాళ్లు ఎదుర్కోవల్సి వస్తుంది. పనిచేసేచోట యజమాని వైఖరి కారణంగా మానసిక ఇబ్బందికి గురవుతారు. ఉద్యోగం మారాలనుకుంటే పూర్తిగా సంసిద్ధులవాలి. జీవిత భాగస్వామితో కొత్త వ్యాపారం ప్రారంభించగలరు.
వృషభ రాశి
బుధుడి గోచారంతో వృషభ రాశి జాతకులు అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయంలో సహచర సిబ్బంది, అధికారులతో ఆటంకాలు ఎదుర్కొంటారు. అందుకే సాధ్యమైనంతవరకూ మీ పనిపైనే దృష్టి పెట్టాలి. వ్యాపారులు ప్లానింగ్ ప్రకారం పనిచేస్తే లాభాలు పొందగలరు. లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
కన్యా రాశి
బుధుడి మేష రాశి ప్రవేశం సందర్భంగా కన్యా రాశి జాతకులు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. పెట్టుబడుల్ని వాయిదా వేయడం మంచిది. అత్యవసరమైతే కుటుంబసభ్యుల్ని సలహా తీసుకోవాలి. ఖర్చులపై నియంత్రణ అవసరం. లేకపోతే ఆర్ధిక అవసరాల కోసం అప్పులు తీసుకుంటారు. కుటుంబసభ్యులతో వాద వివాదం చేయకుండా ఉంటే మంచిది. ఇంట్లో పిల్లల ఆరోగ్యం సమస్యగా మారవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook