Benefits of Budhaditya Yoga: రేపు అంటే జూన్ 24న బుధుడు మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్యభగవానుడు ఇప్పటికే అదే రాశిలో సంచరిస్తున్నాడు. వీరిద్దరి కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. ఆస్ట్రాలజీలో ఈయోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇదే రాశిలో బుధుడు జూలై 08 వరకు ఉంటాడు. మిథునరాశిలో బుధుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం
బుధ సంచారం వృషభ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్‌ని ఇస్తుంది. మీ కెరీర్ లోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. జాబ్ చేసేవారికి ఈ సమయం బాగుంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. 


మిధునరాశి
బుధాదిత్య రాజయోగం వల్ల మిథునరాశి వారు కెరీర్ లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. వ్యాపారులు, ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీడియా, రచన మరియు కళా రంగాలకు సంబంధించిన వ్యక్తులు లాభపడతారు. 


Also Read: Mars transit 2023: జూలై 1 నుండి ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..


కన్య రాశి
బుధాదిత్య యోగం కన్యా రాశి వారికి సూపర్ గా ఉంటుంది. మీ సంపద రెట్టింపు అవుతుంది. మీ పనితీరు మునుపటి కంటే మెరుగుపడుతుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. మీ మేధో సామర్థ్యం పెరుగుతుంది. 


సింహరాశి 
బుధ సంచారం సింహరాశి వారికి మేలు చేస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. మీకు మంచి మంచి ఆఫర్లు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడుల ద్వారా ప్రయోజనం పొందుతారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీకు కోరుకున్న ధనం లభిస్తుంది. 


తులారాశి
బుధ సంచారం తులారాశి వారికి కలిసి వస్తుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు సమాజంలో గౌరవం పొందుతారు. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీకు ఊహించని ధనలాభం ఉంటుంది. 


Also Read: Ketu Gochar 2023: కన్యా రాశిలోకి వెళ్లనున్న కేతువు.. ఈ 3 రాశులపై డబ్బు వర్షం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook