Mercury transit In Taurus 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం పర్టికలర్ టైం తర్వాత తన రాశిని ఛేంజ్ చేస్తోంది. నవగ్రహాల్లో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది. తెలివితేటలు, వృత్తి మరియు వ్యాపారానికి కారకుడిగా మెర్క్యూరీని భావిస్తారు. ఏ వ్యక్తి  జాతకంలో బుధుడి శుభస్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. జూన్ 7న బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిధునరాశి
మెర్క్యూరీ సంచారం మిథునరాశి వారికి అస్సలు కలిసిరాదు. వృషభ రాశిలో బుధుడి గోచారం వల్ల మీకు చెడు కాలం ప్రారంభమవుతుంది. మీకు ప్రతి పనిలోనూ అపజయమే ఎదురవతుంది. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. ఆర్థికంగా మీరు చాలా కష్టాలను ఎదుర్కోవల్సి వస్తుంది. కుటుంబంలో విభేదాలు రావచ్చు. మీరు ఏదైనా పనిలో విజయం సాదించాలంటే..21 సార్లు 'ఓం నమః శివా' అని జపించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
సింహరాశి 
బుధుడి గోచారం సింహరాశి వారికి అననుకూలంగా ఉంటుంది. మీరు చర్మ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. మీరు కెరీర్ లో అనేక అడ్డంకులు ఎదుర్కోంటారు. మీ పనులన్నీ ఆగిపోతాయి. వ్యాపారులు భారీగా నష్టపోతారు. జీవితంలో  ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీ వైవాహిక జీవితంలో గొడవలు వస్తాయి. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభించదు. మీరు కోరుకున్న జాబ్ లభించదు. ప్రతిరోజూ విష్ణువు నామాన్ని స్మరించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. 


Also Read: Vish Yog in Kumbh 2023: శని రాశిలో 'డేంజరస్ యోగం'.. మెుత్తం 12 రాశులపై దాని ప్రభావం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook