Vish Yog in Kumbh 2023: శని రాశిలో 'డేంజరస్ యోగం'.. మెుత్తం 12 రాశులపై దాని ప్రభావం..

Vish Yog 2023 effect: చాలా ఏళ్ల తర్వాత కుంభరాశిలో శని-చంద్రుల కలయిక ఏర్పడింది. వీరిద్దరి సంయోగం అరుదైన విషయోగాన్ని చేస్తుంది. ఈ యోగ ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై ఎలాంటి ప్రబావం చూపుతుందో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 14, 2023, 08:37 AM IST
Vish Yog in Kumbh 2023:  శని రాశిలో 'డేంజరస్ యోగం'.. మెుత్తం 12 రాశులపై దాని ప్రభావం..

Shani Chandra Conjunction in Kumbh Rashi 2023: జ్యోతిషశాస్త్రంలో శనిదేవుడిని న్యాయధీశుడిగా పేర్కొంటే.. చంద్రుడిని మనస్సుకు కారకుడిగా భావిస్తారు. శని గ్రహం రెండున్నరేళ్లకు ఒకసారి తన రాశిని మార్చుకుంటే.. చంద్రుడు ప్రతి మూడు రోజులకు ఒకసారి తన రాశిని ఛేంజ్ చేస్తాడు. 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలో శని-చంద్రుల కలయిక ఏర్పడింది. దీని కారణంగా డేంజరస్ విషయోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం 12 రాశులవారిపై ఎలా ఉంటుందో తెలుసుకోండి.  

మేషరాశి - విష యోగం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు మీ లైఫ్ పార్టనర్ నుండి ఆనందాన్ని పొందుతారు. మీ ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. మీ మనసు ఆనందంగా ఉంటుంది.
వృషభం - విష యోగం మీకు కలిసి వస్తుంది. మీకు ఉద్యోగ, వ్యాపారాల్లో ఈ సమయం బాగుంటుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ ఆదాయం డబల్ అవుతుంది. 
మిథునం - శని చంద్రుల కలయిక కారణంగా ఏర్పడిన విష యోగం మీకు టెన్షన్ వాతావరణాన్ని కల్పిస్తుంది. వ్యాపారులకు ఈ సమయం బాగుంటుంది. మీరు మంచి లాభాలను గడిస్తారు.
కర్కాటక రాశి-విష యోగం వల్ల మీ ఆదాయం తగ్గే అవకాశం ఉంది. మీ కుటుంబంలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. అంతేకాకుండా మీలో ఆందోళన కూడా ఉంటుంది. 
సింహ రాశి- విష యోగం వల్ల మీరు మిశ్రమ ఫలితాలు పొందుతారు. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీరు ఈ సమయంలో సంయమనంతో వ్యవహారించాలి. 
కన్యారాశి - శని-చంద్రుల సంయోగం వల్ల మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. అంతేకాకుండా మీ మనస్సు కలత చెందే అవకాశం ఉంది. 

Also Read: Astrology: మరో 2 రోజుల్లో వృషభ రాశిలో ఊహించని పరిణామం.. ఈ 5 రాశులవారు డబ్బు నష్టపోవడం ఖాయం..

తుల రాశి - విష యోగం వల్ల మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు భారీగా లాభాలను పొందే అవకాశం ఉంది. మీ మనసు ఆనందంగా ఉంటుంది. ఈ సమయంలో మీ కోపాన్ని నియంత్రించుకోండి. 
వృశ్చికం - విష యోగం వల్ల మీ కెరీర్‌లో సానుకూల మార్పులు వచ్చే అవకాశం ఉంది. మీరు పురోగతి సాధిస్తారు. మీ డబ్బు రెట్టింపు అవుతుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 
ధనుస్సు - విష యోగం ధనస్సు రాశి వారి కోపాన్ని పెంచుతుంది. ఉద్యోగంలో అడ్డంకులు వస్తాయి. మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అంతేకాకుండా ఈ సమయంలో ఎవరితోనూ వాదించవద్దు.
మకరం- ఈ డేంజరస్ యోగం వల్ల మీరు డబ్బుతోపాటు గౌరవాన్ని పొందుతారు. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. మీరు మీ పనిని విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది. 
కుంభం - మీరు పూర్వీకుల ఆస్తి ద్వారా ప్రయోజనం పొందుతారు. మీరు కుటుంబ సమేతంగా ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉంది. మీ మనస్సు ఆందోళన చెందుతుంది. 
మీనం - మీ కుటుంబంలో టెన్షన్ వాతావరణం ఉంటుంది. మీరు ఈ సమయంలో నిరాశ చెందే అవకాశం ఉంది. 

Also read: Shani Vakri 2023: జూన్ 17న శనిదేవుడి తిరోగమనం.. ఈ 3 రాశులకు ప్రత్యేక ప్రయోజనం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News