Mercury transit in leo 2023: జాతకంలో గ్రహాలు, రాశుల స్థానాలను బట్టే మన ఫ్యూచర్ ను చెబుతారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. అందుకే ఆస్ట్రాలజీలో గ్రహాల స్థానానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. ఇతడిని వ్యాపారం, డబ్బు, తెలివితేటలకు కారకుడిగా భావిస్తారు. బుధుడి రాశి మార్పు మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. నిన్న అంటే జూలై 25న బుధుడు సూర్యుడి రాశి అయిన సింహరాశిలోకి (Mercury transit in leo) ప్రవేశించాడు. బుధుడి సంచారం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటక రాశి (Cancer)
 సింహరాశిలో బుధుడి ప్రవేశం కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీకు ఆదాయం పెరగడం వల్ల ఆర్థికంగా బలపడతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. మీరు కెరీర్ లో ఉన్నతస్థాయికి ఎదుగుతారు. అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. 
వృషభం(taurus)
మెర్క్యూరీ రాశి మార్పు వృషభరాశి వారికి కలిసి వస్తుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు అప్పును చెల్లిస్తారు. అంతేకాకుండా ఈ సమయంలో మీరు శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీరు కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకు స్థిర చరాస్తులు కలిసి వస్తాయి. అంతేకాకుండా ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. 
వృశ్చికం(Scorpio)
బుధుడు మారడం వృషభరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు ప్రతి పనిలో లక్ కలిసి వచ్చి దానిని త్వరగా పూర్తి చేస్తారు. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆఫీసులో మీ బాధ్యతలు కూడా పెరుగుతాయి. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. మీ లవ్ సక్సెస్ అవుతుంది. అంతేకాకుండా మీ దాంపత్య జీవితం బాగుంటుంది. 


(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Grahana yogam: తులా రాశిలో ఏర్పడనున్న గ్రహణ యోగం, రెండ్రోజులు తస్మాత్ జాగ్రత్త



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook