Grahana yogam: తులా రాశిలో ఏర్పడనున్న గ్రహణ యోగం, రెండ్రోజులు తస్మాత్ జాగ్రత్త

Grahana yogam: హిందూమతం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఎప్పటికప్పుడు గ్రహాలు నక్షత్రాలు రాశి మారుతుంటాయి. ఒక్కొక్కసారి ఒకే రాశిలో రెండు మూడు గ్రహాలు కలిసి యుతి ఏర్పరుస్తుంటాయి. ఈ యుతి ప్రభావం ఇతర రాశులపై శుభంగా, అశుభంగా ఉంటుంది. పూర్తి వివరాలు మీ కోసం..

Grahana yogam: అదే విధంగా రాహు కేతువులతో చంద్రుడు జత చేరితే గ్రహణ యోగం నిర్మాణమౌతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యోగం అత్యంత అశుభంగా భావిస్తారు. అంతేకాకుండా ప్రమాదకరం కూడా. తులా రాశిలో ఈ యోగం నిర్మాణం కావడం వల్ల రానున్న రెండ్రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి.

1 /5

2 /5

రాహు కేతువులు జ్యోతిష్యం ప్రకారం ఏదైనా జాతకం కుండలిలో రాహు కేతువుల్లో ఏ ఒక్కటైనా చంద్రునితో కలిసి యుతి ఏర్పరిస్తే గ్రహణ యోగం ఏర్పాటౌతుంది.

3 /5

మెదడు మస్తిష్కం గ్రహణ యోగం ప్రభావం మనిషి మస్తిష్కంపై పడుతుంది. ఫలితంగా ఆ వ్యక్తికి ఒత్తిడి, అతి ఆలోచనలు, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. ఆరోగ్యపరంగా కూడా సమస్యలు ఏర్పడతాయి.

4 /5

తులా రాశి జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహణ యోగం ప్రభావం చాలా వ్యతిరేకంగా ఉంటుంది. మనిషి ఆందోళనగా ఉంటాడు. గ్రహణ యోగం తులా రాశిలో జూలై 25వ తేదీ మద్యాహ్నం 11 గంటల 13 నిమిషాలకు ఏర్పడనుంది. ఈ ప్రభావం జూలై 27 సాయంత్రం 7 గంటల 28 నిమిషాల వరకూ ఉంటుంది. \

5 /5

గ్రహణ యోగం ప్రస్తుతం కేతువు గోచారం తులా రాశిలో జరుగుతోంది. మంగళవారం అంటే ఇవాళ ఈ రాశిలో చంద్రుడు ప్రవేసించాడు. దాంతో తులా రాశిలో గ్రహణ యోగం ఏర్పడింది.