Mercury transit 2024: అదే సమయంలో ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కో అంశానికి కారకంగా పరిగణిస్తారు. బధుడిని బుద్ధి, వ్యాపారం, ధనానికి ప్రతీకగా భావిస్తారు. జనవరి 7వ తేదీన బుధుడి రాశి పరివర్తనం ప్రభావం 3 రాశులకు ఊహించని విధంగా ఉండనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యం ప్రకారం జనవరి 7 వతేదీన బుధుడు ధనస్సు రాశిలో ప్రవేశించనున్నాడు. గ్రహాల రాజకుమారుడిగా భావించే బుధుడి గోచారంతో కొందరికి మహర్దశ పట్టనుంది. ముఖ్యంగా కుండలిలో బుధుడు శుభ స్థితిలో ఉంటే అంతా సానుకూలంగా ఉంటుంది. జనవరి 2వ తేదీన ఇప్పటికే బుధుడు మార్గమై ఉన్నాడు. బుధుడి రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై ఉన్నా..మూడు రాశులవారికి మాత్రం అత్యంత శుభప్రదం కానుంది. ఏయే రాశులకు ఎలా ఉంటుందో పరిశీలిద్దాం..


బుధుడి గోచారం ప్రభావం ధనస్సు రాశి జాతకులకు అత్యద్భుతంగా ఉండనుంది. ఊహించని ధనలాభం కలుగుతుంది. ఉద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా పదోన్నతి లభిస్తాయి. వ్యాపారులు విశేషమైన లాభాలు ఆర్జించడమే కాకుండా కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చు. పూర్వీకుల సంపద లాభిస్తుంది. ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. 


మిధున రాశి జాతకులకు బుధుడి గోచారం ప్రభావంతో మహర్దశ పట్టనుంది. చేపట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది. కొత్త ఇళ్లు లేదా కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశముంది. ఆకశ్మిక ధనలాభం ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. 


బుధుడి గోచారంతో కన్యా రాశి జాతకులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారి ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. ముఖ్యంగా వైద్యం, రియల్ ఎస్టేట్, ఆస్తి సంబంధిత రంగాల్లో మంచి లాభాలు ఆర్జిస్తారు. ఊహించని ధనలాభం ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు తెర్చుకుంటాయి. ఆరోగ్యం విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. 


Also read: Saphala Ekadashi 2024: సఫల ఏకాదశి రోజున ఈ 4 వస్తువులు ఇంటికి తెస్తే.. మీకు డబ్బే డబ్బు..లాభాలే లాభాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook