COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mercury-Venus Transit In Telugu: మరికొద్ది రోజుల్లో జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన శుక్ర బుధ గ్రహాలతో పాటు మరికొన్ని గ్రహాలు రాశులను మార్చుకోబోతున్నాయి. ముఖ్యంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన టుతగ్రహం మార్చి 7వ తేదీన మీనరాశిలోకి సంచారం చేయబోతోంది. శని రాశి అయిన కుంభరాశిని వదిలి మీనరాశిలోకి సంచారం చేయడం కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే బుధుడు సంచారం చేసిన వెంటనే అదే కుంభరాశిలోకి శుక్రుడు ప్రవేశించబోతున్నాడు. అయితే ఇదే రాశిలో ఇంతకుముందు రాహు కూడా సంచారం చేశాడు.. దీని కారణంగా మీనరాశిలో రాహువు బుధ కలయిక జరగబోతోంది. ఇదంతా మహాశివరాత్రికి ముందు రోజు మార్చి ఏడవ తేదీన జరగబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి విపరీతమైన తన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. 


కన్యారాశి:
మహాశివరాత్రి ఒక రోజు ముందు జరిగే బుధ శుక్ర గ్రహాల సంచారం కొన్ని రాశులతో పాటు కన్యా రాశి వారికి కూడా చాలా శుభ్రంగా ఉండబోతోంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి ఈ సమయంలో ఇంతకుముందు ఎప్పుడు పొందలేని శుభవార్తను పొందే అవకాశాలు ఉన్నాయి వ్యాపార పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. దీంతోపాటు ఆర్థిక పరిస్థితులు కూడా మీకు సహకరిస్తాయి. ఈ సమయంలో వీరు శివుడిని పూజించడం వల్ల శివపార్వతులను గ్రహం కూడా లభిస్తుంది. దీని కారణంగా విపరీతమైన ధనం లభిస్తుంది.


మిథున రాశి:
మహాశివరాత్రికి ఒకరోజు ముందు జరిగే ఈ రెండు గ్రహాల సంచారం కారణంగా మిధున రాశి వారికి కూడా చాలా మేలు జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా అధికంగా డబ్బు లభించి అప్పుల నుంచి కూడా సులభంగా విముక్తి పొందుతారు. దీంతోపాటు వీరు ఖాళీ సమయాల్లో కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు కూడా వెళ్తారు. అలాగే పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది ఎంతో ముఖ్యమైన సమయంగా భావించవచ్చు.


Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!


సింహరాశి:
సింహ రాశి వారికి కూడా మహాశివరాత్రి చాలా ప్రయోజనకరంగా ఉండబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శుక్రుడు సంచారం వీరికి ఎంతో శుభప్రదంగా ఉండబోతోంది. వ్యాపారాలు చేసే వారికి అనేక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు చేసేవారికి ఒత్తిడి కూడా తగ్గే ఛాన్స్‌ ఉంది. అలాగే కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా ఉంటారు. అంతేకాకుండా ఆరోగ్యంపై కూడా వీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. 


Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter