Budh Asta 2023 in Kumbh effects: గ్రహాల కాలానుగుణంగా ఉదయించడం లేదా అస్తమించడం చేస్తాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఫిబ్రవరి 28, 2023న ఉదయం 9:00 గంటలకు బుధుడు కుంభరాశిలో అస్తమిస్తాడు. ఇది కొన్ని రాశులవారిపై సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. మెర్క్యూరీ యెుక్క అస్తమయం కొన్ని రాశులవారు చాలా సమస్యలను ఎదుర్కోనున్నారు. ఏ రాశుల వారికి బుధుడు సంచారం మంచిది కాదో తెలుసుకుందాం. 
ఈ రాశులవారిపై చెడు ప్రభావం
వృషభం: బుధుడు అస్తమించడం వల్ల వృషభ రాశి వారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. మీరు చికాకు కలుగుతుంది. 
మిథునం: అస్తమించిన బుధుడు మిథునరాశి వారికి పనిలో సమస్యలను సృష్టిస్తాడు. వ్యాపారంలో లాభం పొందుతారు. విద్యార్థులకు సమస్యలు వస్తాయి.
సింహ రాశి : సింహ రాశి వారికి బుధుడు వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. మీ వైవాహిక జీవితంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది.
కన్య: కుంభరాశిలో బుధుడు అస్తమించడం కన్యారాశి వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది. కోర్టు కేసుల్లో ఓడిపోయే అవకాశం ఉంది. ఆఫీసులో కొలిగ్స్ తో విభేదాలు రావచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తుల : తులారాశి వారికి బుధుడు సత్ఫలితాలను ఇవ్వడు. ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోండి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టుకోవడం మానుకోండి. 
మకరం: అస్తమించిన బుధుడు మకర రాశి వారి మాటలపై చెడు ప్రభావం చూపుతుంది. మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. 
కుంభం: మెర్క్యూరీ అస్తమయం కుంభరాశివారిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మీరు భారీగా డబ్బు నష్టపోతారు. ఆర్థికంగా నష్టపోతారు. ఫ్యామిలీ లైఫ్ లో సమస్యలు వస్తాయి. 
మెర్క్యురీ అస్తమయ నివారణలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బుధ గ్రహం యెుక్క ప్రతికూల ప్రభావాలను నివారించడానికి దుర్గామాతను పూజించండి. అంతేకాకుండా బుధ గ్రహానికి సంబంధించిన మంత్రాలను జపించండి. ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించండి.


Also Read: Guru Planet: రేవతీ నక్షత్రంలో ప్రవేశించిన బృహస్పతి... వీరి ఆదాయం రెట్టింపు అవ్వడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook