Surya Gochar 2023:  ఏప్రిల్ 14న సూర్యుడు మేషరాశిలో సంచరిస్తాడు. దీనినే మేష సంక్రాంతి అంటారు. ఈ రాశిలో సూర్యుడు బలమైన స్థితిలో ఉంటాడు. అయితే ఇదే రాశిలో కలిసి ఉండటం వల్ల సూర్యుడి యెుక్క శుభప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా ఇదే రాశిలో సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. మేషరాశిలో సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశులవారు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోనున్నారు. ఆ రాశులేంటో ఓ లుక్కేద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్య సంచారం ఈ రాశులకు నష్టదాయకం
మేషరాశి
సూర్యుడి గోచారం వల్ల వృషభరాశి వారు అనేక అడ్డంకులను ఎదుర్కోంటారు. ఆఫీసులో మీ టైం అస్సలు బాగోదు. మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. మీ ఆదాయంలో తగ్గుదల ఉంటుంది. మీరు భారీగా డబ్బు నష్టపోతారు. కుటుంబంలో టెన్షన్ వాతావరణం ఉంటుంది. ఆరోగ్యాన్ని ఈసమయంలో జాగ్రత్తగా చూసుకోండి. 


కన్యా రాశి
మేషరాశిలో సూర్యుని సంచారం కారణంగా కన్యా రాశి వారు ఇబ్బందులు పడతారు. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు పని ఒత్తిడి పెరుగుతుంది. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మీరు అనారోగ్యానికి గురవుతారు. మీ లవ్ లో సమస్యలు వస్తాయి. 


Also Read: సూర్య మహాదశ ఎఫెక్ట్.. వచ్చే 6 ఏళ్లు మీకు డబ్బే డబ్బు...లాభాలే లాభాలు..


తుల రాశి
సూర్య సంచారం వల్ల మీ కెరీర్ దెబ్బతింటుంది. మీ సీనియర్లతో గొడవలు అవుతాయి. ప్రయాణాలు కలిసిరావు. మీరు ఒత్తిడిని ఎదుర్కోంటారు. ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. మీరు డబ్బును దుబారా చేస్తారు. మీ కెరీర్ ఒడిదుడుకులకు గురవుతుంది.


మకర రాశి
సూర్యుడు మేషరాశిలోకి వెళ్లడం వల్ల మకర రాశి వారు తమ వృత్తిలో సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవల్సి రావ్చు. మీ ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఇతరులతో గొడవలు రావచ్చు. వైవాహిక జీవితంలో టెన్షన్ వాతావరణం ఉంటుంది  


మీన రాశి
సూర్యుని యొక్క సంచారం మీన రాశి వారు బిజినెస్ లో భారీగా నష్టాలను చవిచూస్తారు. మీ ఖర్చులు ఆకస్మాత్తుగా పెరుగుతాయి. మీ ఆరోగ్యం దెబ్బ తింటుంది. దీంతో మీరు ఎక్కువగా డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీ కెరీర్ లో ఆటంకాలు ఎదురవుతాయి. 


Also Read: Ashubh yog: అశుభ యోగం చేస్తున్న బుధుడు-కుజుడు... ఈ 5 రాశులకు కష్టాలు షురూ..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి