Mangal Budh Parivartan Yog: ఈనెల 20న సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇదే రోజు గ్రహాల వింత కలయిక ఏర్పడుతోంది. గ్రహణ సమయంలో సూర్యుడు రాహువు మరియు బుధ గ్రహాలు మేషరాశిలో ఉంటారు. అదే టైంలో కుజుడు మిథున రాశిలో సంచరిస్తాడు. ఆస్ట్రాలజీ ప్రకారం, మిథునరాశికి బుధుడు, మేషరాశికి కుజుడు అధిపతిగా భావిస్తారు. అయితే మిథునరాశిలో కుజుడు ఉండడం, బుధుడు మేషరాశిలో ఉండడం వల్ల రాశి మారే యోగం ఏర్పడుతోంది. ఈ అశుభ యోగం వల్ల 5 రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఇందులో మీరున్నారేమో చెక్ చేసుకోండి.
మేషం (Aries)
గ్రహాల మార్పు మేష రాశి వారికి అననుకూల ఫలితాలను ఇస్తుంది. దీని కారణంగా మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. మానసికంగా ఒత్తిడికి గురవుతారు. ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీరు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఈటైంలో జాబ్ అస్సలు మారవద్దు. పరిహారంగా ప్రతి గురువారం గోధుమలను దానం చేయండి.
వృషభం(taurus)
ఈ అశుభ యోగం వృషభ రాశి వారి జీవితంలో కష్టాలను పెంచుతుంది. మీరు వృత్తి మరియు ఫ్యామిలీలో చాలా సమస్యలను ఎదుర్కోంటారు. ఈ సమయంలో మీ కోపం పెరుగుతుంది. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మీరు అప్పు తీసుకుంటారు. తద్వారా ఒత్తిడికి గురవుతారు. నివారణగా ప్రతి ఆదివారం ఒక పేద వ్యక్తికి ఆహారం ఇవ్వండి.
కన్యా (Virgo)
కన్య రాశి వ్యక్తులు కుజుడు మరియు బుధ గ్రహాల సంచారం కారణంగా ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. మీ ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటుంది. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. మీ కుటుంబంలో టెన్షన్ వాతావరణం ఉంటుంది. ఆఫీసులో చాలా సమస్యలను ఎదుర్కోంటారు. సహద్యోగులతో గొడవలు రావచ్చు. మీ మనసు ఆందోళనకు గురవుతుంది. పరిహారంగా ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్లి బూందీ లడ్డూలను సమర్పించండి.
Also Read: Mesh Sankranti 2023: ఏప్రిల్ 14న సూర్యుడు- రాహువుల కలయిక.. ఈ రాశులవారి దశ తిరగబోతోంది!
తుల (Libra)
ఈ అశుభ యోగం వల్ల తుల రాశి వారు ఒకేసారి అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణిస్తుంది. దీంతో మీరు నిరంతరం ఆందోళన చెందుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. పనుల్లో ఆటంకాలు వస్తాయి. మీరు సంతాన సమస్యలను ఎదుర్కోంటారు. కెరీర్ ఆశించిన విధంగా ఉండదు. పరిహారంగా ప్రతి బుధవారం చంద్రుడిని దానం చేయండి.
మకరం (Capricorn)
ఈ అశుభ యోగం కారణంగా మకర రాశి వారికి అనుకోకుండా కెరీర్ మరియు వ్యాపారంలో సమస్యలు వస్తాయి. సంబంధాలు క్షీణిస్తాయి. ఆఫీసులో పని చేయడం మీకు భారంగా అనిపిస్తుంది. మీ తల్లి ఆరోగ్యం చెడిపోతుంది. పరిహారంగా ప్రతి మంగళవారం బజరంగబలిని పూజించండి.
Also Read: Surya Grahan Effects: సూర్యగ్రహణానికి, భారత్ లో కరోనా కేసులు పెరగడానికి ఏం సంబంధం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి