Money Rain will on These 4 zodiac signs due to Lakshminarayana Raja Yogam 2023: 2022 సంవత్సరం మరో రెండు రోజుల్లో ముగిపోనుంది. 2022 ముగిసేలోపు కొన్ని రాశుల వారికి శుభ సమయం ప్రారంభం కానుంది. బుధవారం (డిసెంబర్ 28) మకర రాశిలోకి బుధుడు సంచరించాడు. నేడు (డిసెంబర్ 29) మకర రాశిలో శుక్రుడు ప్రవేశించాడు. మకర రాశిలో శుక్రుడు, బుధుడు కలవడం వల్ల 'లక్ష్మీనారాయణ రాజయోగం' ఏర్పడింది. జ్యోతిషశాస్త్రంలో లక్ష్మీ నారాయణ రాజయోగం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రాజయోగం అపారమైన సంపద ప్రయోజనాలను ఇస్తుంది. ఈరోజు నుంచి ఏయే రాశుల వారికి లక్ష్మీ నారాయణుని వల్ల మేలు జరుగుతుందో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి: 
బుధ సంచారం మరియు శుక్ర సంచారం వలన ఏర్పడిన లక్ష్మీనారాయణ యోగం మేష రాశి వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. మేష రాశి వ్యక్తులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాలు భారీగా ఉంటాయి. ఆర్థిక స్థితి బలపడటం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.


మిథున రాశి: 
లక్ష్మీనారాయణ యోగం మిథున రాశి వారికి కూడా మంచి రోజులను తెస్తుంది. ఇప్పటివరకు కెరీర్‌లో ఉన్న సమస్యలు అన్ని సమసిపోతాయి. వ్యక్తిత్వ ప్రభావం పెరుగుతుంది. వ్యాపారస్తులు లాభపడతారు. కొత్త సంవత్సరం ప్రారంభం ఆహ్లాదకరమైనదిగా ఉంటుంది.


తులా రాశి: 
లక్ష్మీనారాయణ రాజయోగం వల్ల తులా రాశి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఇప్పటివరకు మీ కెరీర్‌లో ఎదుర్కొంటున్న కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు. ప్రగతి మార్గం తెరుచుకుంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి పనిలో విజయం ఉంటుంది. ఆదాయం భారీగా పెరుగుతుంది. ఒంటరిగా ఉన్నవారు వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వివాహితుల జీవితాల్లో సంతోషం ఉంటుంది.


వృశ్చిక రాశి: 
మకర రాశిలో బుధ, శుక్రుల కలయికతో ఏర్పడిన లక్ష్మీనారాయణ రాజయోగం వృశ్చిక రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం ఉంటుంది. సుఖశాంతులతో జీవితాన్ని గడుపుతారు. వ్యాధుల నుంచి ఉపశమనం ఉంటుంది. మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. కుటుంబ జీవితాన్ని బాగా ఆనందించగలరు.


Also Read: TSSPDCL JLM Notification 2023: నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా జూనియర్ లైన్‌మెన్ పోస్టులు!   


Also Read: Venus Transit 2023: 2023 ఆరంభంలో అరుదైన మహాలక్ష్మి రాజయోగం.. ఈ 4 రాశుల వారికి భారీగా పెరగనున్న బ్యాంక్ బ్యాలెన్స్‌!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.