TSSPDCL JLM Notification 2023: నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా జూనియర్ లైన్‌మెన్ పోస్టులు!

TSSPDCL Junior Lineman Notification 2023. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ జూనియర్ లైన్‌మెన్ పోస్టులు భారీగా పెరగనున్నాయి. 2023లో విడుదల అయ్యే నోటిఫికేషన్‌లో 1300 పోస్టులు ఉండొచ్చని అంచనా.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 29, 2022, 10:21 AM IST
  • నిరుద్యోగులకు శుభవార్త
  • భారీగా జూనియర్ లైన్‌మెన్ పోస్టులు
  • 1300 పోస్టులు ఉండొచ్చని అంచనా
TSSPDCL JLM Notification 2023: నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా జూనియర్ లైన్‌మెన్ పోస్టులు!

TSSPDCL Junior Lineman Notification 2023: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండంతో తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా వరుసగా జాబ్స్ నోటిఫికేషన్స్ పడుతున్న విషయం తెలిసిందే. గత 4-6 నెలలుగా రాష్ట్రంలోని అన్ని విభాగాల్లో వరుసుగా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇప్పటికే ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. తాజాగా రాష్ట్రంలోని మరో రెండు శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసింది. విద్యుత్ విభాగంలో కూడా త్వరలోనే నోటిఫికేషన్ పడే అవకాశాలు ఉన్నాయి. 

తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్)లో జూనియర్ లైన్‌మెన్ పోస్టులు భారీగా పెరగనున్నాయి. కొత్త సబ్‌స్టేషన్స్, నూతన సెక్షన్స్ ఏర్పాటు కావడంతో.. పోస్టుల సంఖ్య పెరగనున్నట్లు సమాచారం తెలుస్తోంది. 2023లో విడుదల అయ్యే నోటిఫికేషన్‌లో 1300 పోస్టులు ఉండొచ్చని విద్యుత్ అధికారులు అంచనా వేస్తున్నారు. 

టీఎస్ఎస్‌పీడీసీఎల్ జూనియ‌ర్ లైన్‌మెన్ ప‌రీక్ష ర‌ద్దు చేస్తూ ఈ ఏడాది తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న విషయం తెలిసిందే. 2022 జులై 17న వెయ్యి పోస్టుల జూనియ‌ర్ లైన్‌మెన్ భ‌ర్తీకి రాత ప‌రీక్ష నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. 181 మంది అభ్య‌ర్థులు మాల్ ప్రాక్టీస్ పాల్ప‌డిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. దాంతో ఆ నోటిఫికేషన్‌ రద్దయింది. ఈ నేపథ్యంలో 2023 ఆరంభంలోనే జూనియ‌ర్ లైన్‌మెన్ నోటిఫికేషన్‌ పడే ఆకాశం ఉంది. 

Also Read: Jagtial Girl Kidnap: జగిత్యాలలో కిడ్నాప్‌ కలకలం.. 12 ఏళ్ల బాలికను కారులో ఎక్కించుకుని..! ఊహించని ట్విస్ట్

Also Read: 2023లో అరుదైన మహాలక్ష్మి రాజయోగం.. ఈ 4 రాశుల వారికి భారీగా పెరగనున్న బ్యాంక్ బ్యాలెన్స్‌!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News