April 2024 Horoscope In Telugu: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..అరుదైన ఆర్థిక లాభాలు కలుగుతాయి
April 2024 Rasi Phalalu In Telugu: ఏప్రిల్ ఎంతో అదృష్టమైన నెలగా జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ నెల హిందువులకు ప్రత్యేకమైన ఉగాది నూతన సంవత్సరంతో ప్రారంభం. అయితే నెలలో ఏ రాశుల వారికి ఎలాంటి లాభం చేకూరుతుందో ఇక్కడ తెలుసుకోండి.
April Monthly Horoscope 2024: ఏప్రిల్ సంవత్సరంలో నాలుగవ నెల. హిందూవులకు ఈ నెల ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ నెలలో ఉగాదితో తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. అలాగే ఈ నెలలో చాలా పెద్ద గ్రహాలు వివిధ రాశులలో సంచరిస్తాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఈ నెల చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో ఏర్పడే ప్రత్యేక ప్రభావంతో ఈ రాశులవారు వివిధ రంగాల్లో ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా వృత్తి జీవితంలో విజయం సాధిస్తారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అలాగే కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే ఈ కొత్త సంవత్సరంలోని మొదటి నెలలో ఏయే రాశులవారు ప్రయోజనాలు పొందుతారో తెలుసుకోండి.
మేషం (Aries) :
ఏప్రిల్ నెలలో ఈ రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. వృత్తి,ఉద్యోగాల్లో విజయం సాధిస్తారు. అంతేకాకుండా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అలాగే కుటుంబం, స్నేహితులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు.
వృషభం (Taurus) :
ఈ నెల వృషభరాశివారికి కొత్త అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగం, వ్యాపారంలో గొప్ప లాభాలు పొందుతారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్థ వహించాలి.
మిథునం (Gemini) :
మిథున రాశి వారికి కొత్త సంవత్సరం మీకు శక్తివంతమైనదిగా ఉంటుంది. దీని కారణంగా లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేయాల్సి ఉంటుంది.ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఇష్ట దైవాని పూజించడం చాలా మంచిది.
కర్కాటకం (Cancer) :
కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా సానుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాంలో విజయం సాధిస్తారు. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. దూర ప్రయాణాలు కూడా చేస్తారు.
సింహం (Leo) :
ఈ నెల మీకు చాలా శృంగారభరితంగా ఉంటుంది. అలాగే ప్రేమ జీవితంలో చాలా ఆనందాన్ని పొందుతారు. పూర్వీకుల ఆస్తిలు లభిస్తాయి.
కన్య (Virgo) :
ఏప్రిల్ నెల కన్యరాశివారికి మనసు సంతోషంగా ఉంటుంది. రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. వృత్తి జీవితంలో కూడా విజయం సాధిస్తారు.
తుల (Libra) :
ఈ ఏడాది తుల రాశివారికి స్నేహితులు, కుటుంబంతో చాలా సమయం గడుపుతారు. అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు.
వృశ్చికం (Scorpio) :
వృశ్చిక రాశివారుకి ఈ నెల ఎంతో మంచిగా ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి అయిన వారికి ఈ సమయం శృంగారబరితంగా ఉంటుంది. జీవితంలో చాలా మంచి విషయాలను పొందుతారు.
ధనస్సు (Sagittarius) :
ధనస్సు రాశి వారు ఈ నెల అదృష్టంగా ఉంటుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అందకరమైన జీవతాని పొందుతారు.
మకర (Capricorn) :
మకర రాశివారు చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. అనుకున్న లక్ష్యాలను చేరుకుకోవడానికి ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. ఇష్టదేవతకు పూజలు చేయడం వల్ల అనుకున్న లాభాలు పొందుతారు.
కుంభం (Aquarius) :
కుంభం రాశివారికి ఏప్రిల్ నెల సృజనాత్మకంగా ఉంటుంది. జీవితంలో చాలా కొత్త విషయాలను ప్రయత్నిస్తారు. ధనలాభం కూడా లభిస్తుంది.
మీనం (Pisces) :
ఈ ఏప్రిల్ నెల మీనం రాశివారికి చాలా ఆధ్యాత్మికంగా ఉంటుంది. జీవితంలో చాలా శాంతిని, సంతృప్తిని పొందుతారు. ఉద్యోగంలో మంచి లాభాలు, పేరు పొందుతారు.
ఈ రాశుల వారు ఈ నెలలో ఈ క్రింది చిట్కాలను పాటించడం ద్వారా వారి అదృష్టాన్ని మరింత మెరుగుపరచుకోవచ్చు:
దేవుడిని పూజించండి:
ప్రతిరోజూ దేవుడిని పూజించడం వల్ల మీకు అదృష్టం లభిస్తుంది.
దానం చేయండి:
దానం చేయడం వల్ల మీ పుణ్యం పెరుగుతుంది. మీకు అదృష్టం లభిస్తుంది.
సానుకూలంగా ఉండండి:
సానుకూల ఆలోచనలు మీకు అదృష్టాని తీసుకువస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి